Harry Boxer Detained in US: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు హ్యారీ బాక్సర్ అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harry Boxer Detained in US: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన కీలక అనుచరుడు హ్యారీ బాక్సర్‌ను అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. పలు హత్యలు, బెదిరింపులు, బలవంతపు వసూళ్ల కేసుల్లో పోలీసులకు కావాల్సిన హ్యారీ బాక్సర్ అలియాస్ హరిరామ్‌ను అమెరికాలోని కాలిఫోర్నియాలో అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ నుంచి అందిన కీలక సమాచారంతో శుక్రవారం రాత్రి ఈ చర్య చేపట్టినట్లు తెలిపారు.
అధికారుల వివరాల ప్రకారం.. హ్యారీ బాక్సర్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. అమెరికాలో ఉంటూ గ్యాంగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా భారత్‌లోని పలువురిని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులను కూడా సోషల్ మీడియా పోస్టులు, ఆడియో సందేశాల ద్వారా బెదిరించినట్లు అధికారులు తెలిపారు. దీంతో అతడి కదలికలపై భారత దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి.
Also Read
- Trump Assassination Threat: ట్రంప్ హత్యకు కుట్ర?.. మూడు తుపాకులతో వైట్‌హౌస్ వద్ద వెనిజులా వ్యక్తి పట్టివేత
- Paraguay Crisis: పరాగ్వేలో రాజకీయ సంక్షోభం.. అధ్యక్ష పదవి నుంచి శాంటియాగో పెనా తొలగింపు, గృహనిర్బంధం!
- Diwali at White House: వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా అందించిన భారతీయ వ్యాపారవేత్త
- Stephen Miller: మిడ్‌టర్మ్ ఎన్నికల షాక్ తర్వాత ట్రంప్ కీలక నిర్ణయం.. కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ముంబైలోని జుహూలో ఉన్న నివాసం వెలుపల ఈ ఏడాది ఫిబ్రవరిలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు తానే బాధ్యత వహిస్తున్నట్లు హ్యారీ బాక్సర్ ప్రకటించినట్లు సమాచారం. రోహిత్ శెట్టి నివాసం వెలుపల ఐదు రౌండ్ల కాల్పులు జరగడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. అయితే సెక్యూరిటీ గార్డు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించడంతో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా హ్యారీ బాక్సర్ అమెరికాలో పట్టుబడటంతో ఈ కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు సంబంధించిన పలువురు సభ్యులు విదేశాల్లో ఉంటూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హ్యారీ బాక్సర్‌ను అమెరికాలో అదుపులోకి తీసుకోవడం దర్యాప్తు పరంగా కీలక పరిణామంగా భావిస్తున్నారు. అతడిని భారత్‌కు తీసుకురావడానికి సంబంధించి తదుపరి చట్టపరమైన ప్రక్రియలు ఎలా ఉంటాయనే దానిపై అధికారికంగా మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది. హ్యారీ బాక్సర్ అరెస్టుతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయా? బాలీవుడ్ ప్రముఖులకు వచ్చిన బెదిరింపుల వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. అధిక స్థానాల్లో టీడీపీ హవా..!
-
Harry Boxer Detained in US: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు హ్యారీ బాక్సర్ అరెస్ట్..
-
Independent Candidate Victory: జనసేనకు ఝలక్.. 373 ఓట్ల తేడాతో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం..!
-
Revanth Reddy Birthday Wishes: వరి నారుతో సీఎం ‘రేవంత్ రెడ్డి’ చిత్రపటం.. వినూత్నంగా బర్త్‌డే విషెస్ తెలిపిన కాంగ్రెస్ నేత.!
-
Abhishek Banerjee: నా ప్రాణాలు తీయడానికి ఇది ఏడో ప్రయత్నం.. బీజేపీపై అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు!
-
Telangana PG Medical Seats : తెలంగాణలో పీజీ సీట్ల జాతర.. ఒకేసారి 359 పెంపు
ట్రెండింగ్
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
-
క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..
-
500+ kmph వేగాన్ని దాటిన తొలి ప్రొడక్షన్ కారు.. BYD Yangwang U9 Xtreme గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం.!
-
Mohammed Shami Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన రివర్స్ స్వింగ్ కింగ్ ‘మహమ్మద్ షమీ’..!
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?