Basil Joseph: యాక్టింగ్‌ను పక్కనపెట్టి దర్శకుడిగా మారిన హీరో.. బన్నీ కోసమేనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basil Joseph: మలయాళ ఇండస్ట్రీలో వారానికో సినిమాతో అలరిస్తూ.. హీరోయిన్ కీర్తి సురేష్ చేత ముద్దుగా ‘వీక్లీ స్టార్’ అని పిలిపించుకున్న టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్. ఏడాదికి నాలుగైదు చిత్రాలతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసే ఈ హీరో.. గత కొంతకాలంగా వెండితెరపై తనదైన దూకుడు తగ్గించేశారు. సోలో హీరోగా సినిమా వచ్చి ఏడాదిన్నర దాటిపోతున్నా కొత్త ప్రాజెక్ట్‌లను ఒప్పుకోవడం లేదు. ఆఫర్లు లేకనా లేక కావాలనే నటనకు బ్రేక్ ఇచ్చారా అంటే.. తెరవెనుక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో జతకట్టే భారీ పాన్ ఇండియా ప్లాన్ నడుస్తోందనే సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ‘మిన్నల్ మురళి’, ‘గోధా’ వంటి అద్భుతమైన చిత్రాలతో డైరెక్టర్‌గా తన ప్రతిభను దేశవ్యాప్తంగా చాటుకున్న బాసిల్ జోసెఫ్.. ప్రస్తుతం పూర్తిస్థాయిలో మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఇతర ఆఫర్లతో పాటు ‘ధర్మన్’ ప్రాజెక్ట్‌ను కూడా వదులుకున్నట్లు తెలుస్తోంది. డబ్బింగ్ సినిమాలతో మలయాళంలో సైతం భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న అల్లు అర్జున్‌కు బాసిల్ ఇటీవల ఒక అదిరిపోయే కథను వినిపించి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్‌ను పక్కాగా సిద్ధం చేయడం కోసమే బాసిల్ నటనకు తాత్కాలికంగా విరామం ఇచ్చారట.
మొన్నటివరకు ఈ ప్రాజెక్ట్‌పై కేవలం గుసగుసలు మాత్రమే వినిపించగా.. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అల్లు శిరీష్ వివాహ వేడుకలో బాసిల్ జోసెఫ్ ప్రత్యేకంగా హాజరై సందడి చేయడంతో ఈ కాంబినేషన్‌పై మరింత స్పష్టత వచ్చింది. బన్నీ కుటుంబంతో ఆయనకున్న సాన్నిహిత్యం, జరుగుతున్న చర్చలు చూస్తుంటే ఈ క్రేజీ మూవీ పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ – బాసిల్ జోసెఫ్ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. గతంలో ‘మరణమాస్’ చిత్రంతో మెప్పించిన బాసిల్.. ఆ తర్వాత సోలో హీరోగా మళ్లీ కనిపించలేదు. ఈ మధ్య కాలంలో ‘పరాశక్తి’ చిత్రంలో స్పెషల్ అపీరియన్స్, మల్టీస్టారర్ మూవీ ‘అతిరథి’లో ఒక హీరోగా మాత్రమే మెరిశారు. నిర్మాతగా ‘అతిరథి’ మంచి లాభాలను తెచ్చిపెట్టినప్పటికీ, నటుడిగా మాత్రం ఆశించినంత జోరు చూపించలేదు. ప్రస్తుతం కమిట్ అయిన తమిళ చిత్రం ‘రావడి’, ‘మంజేశ్వరం మాఫియా’ మినహా మరే కొత్త చిత్రాన్నీ ఆయన అంగీకరించకపోవడం వెనుక.. బన్నీ సినిమాపైనే ఆయన పూర్తి ఫోకస్ పెట్టారనే వాదనకు మరింత బలం చేకూరుతోంది.
Also Read
- Atulya Chandra : వైద్యుడిపై నటి దాడి కేసులో కళ్లు చెదిరే ట్విస్ట్: బాధితుడు కాదు పచ్చి కామాంధుడు.. ఫోన్లో 12 మంది మహిళల రేప్ వీడియోలు!
- Atulya Chandra : టాలీవుడ్ హీరోయిన్ దొంగతనం కేసులో ట్విస్ట్.. హనీట్రాప్, 6 కోట్లు ఇవ్వకపోవడంతోనే దాడి?
- Rohan : తమిళ, మలయాళ సినిమలంటూ వెళ్లి డైమండ్ లాంటి తెలుగు సినిమాలను లైట్ తీసుకుంటున్నారు!
- Dheeraj Mogilineni : "ఓటీటీలో చూసి ఏడిస్తే లాభం లేదు.. ట్వీట్లు ఆపి థియేటర్‌కు రండి"..సమ్మర్ హాలిడేస్' నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు
-
Basil Joseph: యాక్టింగ్‌ను పక్కనపెట్టి దర్శకుడిగా మారిన హీరో.. బన్నీ కోసమేనా!
-
Healthy Breakfast: ఎముకలకు ఉక్కు బలమిచ్చే రాగి – మునగాకు రొట్టెలను ఇలా తయారు చేసుకోండి!
-
Atulya Chandra : వైద్యుడిపై నటి దాడి కేసులో కళ్లు చెదిరే ట్విస్ట్: బాధితుడు కాదు పచ్చి కామాంధుడు.. ఫోన్లో 12 మంది మహిళల రేప్ వీడియోలు!
-
India vs New Zealand: వర్షం ఆటంకంతో అర్ధంతరంగా ముగిసిన మ్యాచ్.. టీమిండియా థ్రిల్లింగ్ విజయం
-
Surekha Vani : “వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే జైలుకే!”: నటి సురేఖావాణి వీడియో వార్నింగ్
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!