Diwali Celebrations : అమెరికా టు కెనడా.. విదేశాల్లోనూ దీపావళి ధమాకా
- అమెరికా నగరాల్లో దీపావళి సందడి
- న్యూజెర్సీలో రామలీల ప్రత్యేక ఆకర్షణ
- విందు భోజనాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు
- టొరంటో నుంచి స్రే వరకు పండుగ వెలుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌కు వేల మైళ్ల దూరంలో ఉన్నా.. మన సంస్కృతి, ఆచారాలకు విదేశాల్లోనూ దీపావళి వేళ సరికొత్త శోభ సంతరించుకుంది. అమెరికా, కెనడా దేశాలలోని ప్రధాన నగరాలు, వాణిజ్య వీధులు సరికొత్త వెలుగులతో జిగేలుమంటున్నాయి. చిరునవ్వులు, మిఠాయిల కమ్మటి రుచులు, సంగీత వాతావరణం మధ్య ప్రవాస భారతీయులు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. న్యూజెర్సీ నుంచి టొరంటో వరకు ప్రతి వీధి దీపావళి సందడితో కళకళలాడుతోంది.
అమెరికాలో మిరుమిట్లు గొలుపుతున్న దీపావళి వేడుకలు
అమెరికాలోని ప్రముఖ ప్రాంతాలైన న్యూయార్క్, న్యూజెర్సీ, చికాగో, లాస్ ఏంజిల్స్ వంటి నగరాల్లో ప్రవాసులు పెద్ద ఎత్తున వేడుకల్లో నిమగ్నమయ్యారు. న్యూజెర్సీలోని ప్రసిద్ధ ఓక్ ట్రీ రోడ్డులో జరిగిన సంప్రదాయ రామలీల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పండిత్ సత్య నారాయణ చర్కా ఆధ్వర్యంలో సుమారు 40 మంది కళాకారులు అందించిన నృత్యాలు, అద్భుతమైన దుస్తులు, ఇంగ్లీష్ నేరేషన్‌తో కూడిన రామాయణ గాథ అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. ఇక ఎడిసన్ నగరంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో లక్షకు పైగా విద్యుత్ దీపాలు, పాటెల్ బ్రదర్స్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన డ్రోన్, బాణసంచా ప్రదర్శనలు రాత్రి వేళ ఆకాశాన్ని అద్భుతంగా మార్చేశాయి. ఈ వేడుకలకు అమెరికా 250వ వార్షికోత్సవ వేడుకల థీమ్‌ను జోడించడం విశేషం.
Also Read
- Harry Boxer Detained in US: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు హ్యారీ బాక్సర్ అరెస్ట్..
- Trump Assassination Threat: ట్రంప్ హత్యకు కుట్ర?.. మూడు తుపాకులతో వైట్‌హౌస్ వద్ద వెనిజులా వ్యక్తి పట్టివేత
- Paraguay Crisis: పరాగ్వేలో రాజకీయ సంక్షోభం.. అధ్యక్ష పదవి నుంచి శాంటియాగో పెనా తొలగింపు, గృహనిర్బంధం!
- Diwali at White House: వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా అందించిన భారతీయ వ్యాపారవేత్త
ప్రత్యేక వంటకాలు, కనువిందు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు
చికాగో, వాషింగ్టన్ వంటి నగరాల్లోని ప్రముఖ భారతీయ రెస్టారెంట్లు దీపావళిని పురస్కరించుకుని ప్రత్యేక మెనూలను అందుబాటులోకి తెచ్చాయి. రాజ్ కచోరీ చాట్ నుంచి చాక్లెట్ మౌస్ విత్ జామున్ వరకు విభిన్న రుచులతో ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. వాషింగ్టన్‌లోని ఓ రెస్టారెంట్లో గోల్డ్ లీఫ్‌తో తయారు చేసిన బటర్ చికెన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మరోవైపు శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ భాగస్వామ్యంతో ‘ఇండియన్ రెస్టారెంట్ వీక్’ కొనసాగుతుండగా, కాలిఫోర్నియాలోని బాప్స్ మందిరంలో కార్నివాల్ రైడ్స్, ప్రత్యేక లైట్ అండ్ సౌండ్ షోలతో వేడుకలు అంబరాన్ని తాకాయి.
కెనడాలోనూ కొనసాగుతున్న పండుగ శోభ
అమెరికాలోనే కాకుండా కెనడాలోనూ దీపావళి సందడి తక్కువేం లేదు. టొరంటోలోని గెరార్డ్ ఇండియా బజార్లో నిర్వహించిన వీధి మేళాలో లైవ్ డీజే, నృత్యాలు, స్పార్క్లర్స్ వెలుగుల మధ్య ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. మాంట్రియల్ నగరంలో ‘ఇండియా రోసా’ ఏర్పాటు చేసిన విష్ ట్రీ (కోరికల చెట్టు) వద్ద సందర్శకులు తమ దీపావళి ఆకాంక్షలను పంచుకున్నారు. బ్రిటిష్ కొంబియాలోని స్రే నగరంలో మిఠాయిల సందడి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. అధిక స్థానాల్లో టీడీపీ హవా..!
-
Diwali Celebrations : అమెరికా టు కెనడా.. విదేశాల్లోనూ దీపావళి ధమాకా
-
Harry Boxer Detained in US: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు హ్యారీ బాక్సర్ అరెస్ట్..
-
Independent Candidate Victory: జనసేనకు ఝలక్.. 373 ఓట్ల తేడాతో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం..!
-
Revanth Reddy Birthday Wishes: వరి నారుతో సీఎం ‘రేవంత్ రెడ్డి’ చిత్రపటం.. వినూత్నంగా బర్త్‌డే విషెస్ తెలిపిన కాంగ్రెస్ నేత.!
-
Abhishek Banerjee: నా ప్రాణాలు తీయడానికి ఇది ఏడో ప్రయత్నం.. బీజేపీపై అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
-
క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..
-
500+ kmph వేగాన్ని దాటిన తొలి ప్రొడక్షన్ కారు.. BYD Yangwang U9 Xtreme గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం.!
-
Mohammed Shami Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన రివర్స్ స్వింగ్ కింగ్ ‘మహమ్మద్ షమీ’..!
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?