India vs New Zealand: వర్షం ఆటంకంతో అర్ధంతరంగా ముగిసిన మ్యాచ్.. టీమిండియా థ్రిల్లింగ్ విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs New Zealand: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా అనూహ్య విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలోనే నిలిచిపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో (DLS Method) భారత్‌కు 4 పరుగుల తేడాతో విజయం వరించింది. ఉత్కంఠభరితంగా ముగియాల్సిన ఈ మ్యాచ్ ఇలా అర్ధంతరంగా ముగియడం ఫ్యాన్స్‌కి కాస్త నిరాశ కలిగించింది. మ్యాచ్ రద్దయ్యే సమయానికి భారత్ 26 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఆ సమయంలో డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం భారత్ 4 పరుగులు ఆధిక్యంలో ఉంది. వెల్లింగ్టన్లో (Wellington) జరిగిన ఈ రెండో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించగా, గుర్నూర్ బ్రార్ (Gurnoor Brar) అద్భుతమైన బౌలింగ్‌తో (4/30) చెలరేగిపోవడంతో న్యూజిలాండ్ జట్టు కేవలం 41 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ (All out) అయింది.
ఇక, న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో డేరిల్ మిచెల్ (Daryl Mitchell) 55 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిచెల్, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) కలిసి ఆరో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. గుర్నూర్‌తో పాటు అక్షర్ పటేల్ (Axar Patel), ఆకిబ్ నబీ (Auqib Nabi), అన్షుల్ కంబోజ్ (Anshul Kamboj) తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక, 135 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ బ్యాటర్లు తడబడ్డారు. శ్రేయస్ 30, రోహిత్ 23, రాహుల్ 26, నమన్ 12 రన్స్ చేశారు. దీంతో టీమిండియా భారత్ 26 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను కొంత సేపు ఆపారు. వరుణుడు ఎంతటికీ కరుణించపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇక, డీఎల్ఎస్ ప్రకారం భారత్ టార్గెట్ 109కు కుదించారు. దీంతో టీమిండియా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరోవైపు.. న్యూజిలాండ్ బౌలర్లలో డఫీ, జెమీసన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఫిషర్ ఒక వికెట్ తీశాడు. ఈ విజయంతో 5 వన్డేల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వచ్చింది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో (ODI series) ఇప్పటికే వర్షం వల్ల ప్రభావితమైన మొదటి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలిచిన భారత్, ఇప్పుడు ఈ విజయంతో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లేందుకు చూస్తోంది.
Also Read
- Surekha Vani : "వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే జైలుకే!": నటి సురేఖావాణి వీడియో వార్నింగ్
- YS Jagan: బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుపై ఎందుకు దింపారు? రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే లాఠీఛార్జ్ చేస్తారా?
- Garapati Divya: నిన్న గుండెపోటుతో హఠాన్మరణం.. నేడు ఫలితాల్లో ఘన విజయం.. జనసేన అభ్యర్థి కన్నీటి గాథ
- Ananya Agarwal: 21 ఏళ్ల వయసులోనే బిజినెస్.. కేవలం 50 రోజుల్లోనే రూ. 15 లక్షల రెవెన్యూ రాబట్టిన కాలేజీ స్టూడెంట్
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు
-
India vs New Zealand: వర్షం ఆటంకంతో అర్ధంతరంగా ముగిసిన మ్యాచ్.. టీమిండియా థ్రిల్లింగ్ విజయం
-
Surekha Vani : “వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే జైలుకే!”: నటి సురేఖావాణి వీడియో వార్నింగ్
-
Atulya Chandra : టాలీవుడ్ హీరోయిన్ దొంగతనం కేసులో ట్విస్ట్.. హనీట్రాప్, 6 కోట్లు ఇవ్వకపోవడంతోనే దాడి?
-
5G Smartphones: పండక్కి మొబైల్ కొంటున్నారా? రూ. 20 వేల లోపే టాప్ 5 బడ్జెట్ ఫోన్లపై ఓ లుక్కేయండి!
-
YS Jagan: బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుపై ఎందుకు దింపారు? రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే లాఠీఛార్జ్ చేస్తారా?
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!