Trump Assassination Threat: ట్రంప్ హత్యకు కుట్ర?.. మూడు తుపాకులతో వైట్‌హౌస్ వద్ద వెనిజులా వ్యక్తి పట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Assassination Threat: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయాలని తన మెదడులో స్వరాలు వినిపిస్తున్నాయని చెప్పిన ఓ వెనిజులా వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు అరెస్ట్ చేశారు. వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారులో మూడు తుపాకులు, భారీగా బుల్లెట్లు లభించడంతో అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అమెరికాలో కలకలం రేపింది.
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి వైట్‌హౌస్ సమీపంలో పార్క్ చేసి ఉన్న ఓ కారులో అనుమానాస్పదంగా కూర్చున్న వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించారు. అతడి ప్రవర్తనపై అనుమానం రావడంతో అధికారులు కారును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కారులో మూడు వేర్వేరు తుపాకులు, డజన్ల కొద్దీ బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా, ఆ వాహనం దొంగిలించబడినట్లు గతంలో ఫిర్యాదు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Also Read
- Paraguay Crisis: పరాగ్వేలో రాజకీయ సంక్షోభం.. అధ్యక్ష పదవి నుంచి శాంటియాగో పెనా తొలగింపు, గృహనిర్బంధం!
- Diwali at White House: వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా అందించిన భారతీయ వ్యాపారవేత్త
- Stephen Miller: మిడ్‌టర్మ్ ఎన్నికల షాక్ తర్వాత ట్రంప్ కీలక నిర్ణయం.. కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్
- India's Trusted Allies: భారత్‌కు నమ్మకమైన నేస్తాలు ఈ దేశాలే.. సర్వే రిపోర్ట్ వైరల్!
అధికారుల వివరాల ప్రకారం.. అరెస్టయిన వ్యక్తిని రోనీ యోర్డ్రిక్స్ గువానిపా చిరినోస్ (Ronny Yordrix Guanipa Chirinos)గా గుర్తించారు. తన మెదడులో కొన్ని స్వరాలు వినిపిస్తున్నాయని, అవి అమెరికా రాజధాని వాషింగ్టన్కు వెళ్లి రిపబ్లికన్ పార్టీకి చెందిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయాలని చెబుతున్నాయని అతడు అధికారులకు తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకారం.. నిందితుడు వెనిజులాకు చెందిన వలసదారుడు. అతడు మార్చి 2024లో టెక్సాస్ మార్గం ద్వారా అమెరికాలోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో అతడిపై అభియోగాలు నమోదు చేసినట్లు, ప్రస్తుతం యూఎస్ మార్షల్స్ సర్వీస్ కస్టడీలో ఉన్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది.
ఈ ఘటనపై అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ మార్క్వేన్ ముల్లిన్ స్పందించారు. సీక్రెట్ సర్వీస్ అధికారుల అప్రమత్తత వల్లే వైట్‌హౌస్ సమీపంలో మూడు ఆయుధాలతో ఉన్న వ్యక్తిని సకాలంలో అరెస్ట్ చేయగలిగామని తెలిపారు. అతడు ఎవరికైనా హాని కలిగించేలోపే అధికారులు పట్టుకున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గతంలోనూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బెదిరింపులు వచ్చిన ఘటనలపై అమెరికా భద్రతా సంస్థలు చర్యలు తీసుకున్నాయి. తాజా అరెస్ట్‌తో వైట్‌హౌస్ భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: ఓట్ల లెక్కింపు షురూ.. కొన్ని చోట్ల ఆలస్యంగా ప్రారంభమైన కౌంటింగ్..
-
Trump Assassination Threat: ట్రంప్ హత్యకు కుట్ర?.. మూడు తుపాకులతో వైట్‌హౌస్ వద్ద వెనిజులా వ్యక్తి పట్టివేత
-
క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..
-
Paraguay Crisis: పరాగ్వేలో రాజకీయ సంక్షోభం.. అధ్యక్ష పదవి నుంచి శాంటియాగో పెనా తొలగింపు, గృహనిర్బంధం!
-
Man Swallows Toothbrush: టూత్ బ్రష్ మింగేశాడు..డాక్టర్లు ఏం చేశారో తెలిస్తే..
-
AI: ఏఐ బూమ్‌కు బ్రేకులు.. దెబ్బకు బుడగ పేలింది..!
ట్రెండింగ్
-
500+ kmph వేగాన్ని దాటిన తొలి ప్రొడక్షన్ కారు.. BYD Yangwang U9 Xtreme గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం.!
-
Mohammed Shami Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన రివర్స్ స్వింగ్ కింగ్ ‘మహమ్మద్ షమీ’..!
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!