Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- ఇమ్రాన్ ఖాన్‌పై షహబాజ్ షరీఫ్ కక్ష సాధింపు..
- ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ , ప్రభుత్వం రద్దు..
- ఇమ్రాన్ పార్టీ పీటీఐ అధికారాన్ని కూలదోసిన పాకిస్తాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ అధికారంలో ఉన్న ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ‘‘ఎమర్జెన్సీ’’ విధించింది. ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం ఇమ్రాన్‌కు భారీ ఎదురుదెబ్బగా అభివర్ణించవచ్చు. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాల జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రం నుంచే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
పెరుగుతున్న ఉగ్రవాద దాడులు, క్షీణిస్తున్న శాంతిభద్రతల్ని సాకుగా చూపిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం ‘‘అత్యవసర పరిస్థితి’’ విధించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రధాని షహజాబ్ షరీప్ కార్యాలయం పేర్కొంది. ప్రధాని సలహా మేరకు అధ్యక్షుడు ఆసిప్ అలీ జర్దారీ ఎమర్జెన్సీ ప్రకటనపై సంతకం చేశారు.
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
ఇదిలా ఉంటే, ఖైబర్ ఫఖ్తుంఖ్వా గవర్నర్ ఫైసల్ కరీం కుండి ఎమర్జెన్సీ నిర్ణయాన్ని స్వాగతించారు. రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి, ప్రజా శ్రేయస్సుకు ఇది సహకరిస్తుందని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భద్రతా సంస్థలకు ప్రజలు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని కూడా గవర్నర్ అన్నారు. హింస లేదా అల్లర్లలో పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ అధికారాలను హరించేందుకే షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమర్జెన్సీ విధింపు తర్వాత ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌లో భద్రతను పెంచారు. పలు ప్రధాన రహదారులపై కంటైనర్లను మోహరించారు. ఈ ప్రావిన్సు ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిదీ అక్టోబర్ 4న లక్కీ మార్వత్ నుంచి ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం యాత్ర మొదలుపెట్టారు. ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి జైలులో ఉన్నారు. ఆయన విడుదల కోసం పీటీఐ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు రోడ్లపైకి వస్తున్నారు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..