Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- జెలెన్స్కీపై ట్రంప్ విమర్శలు
- రష్యా దాడులు, డీజిల్ ఒప్పందంతో ఉక్రెయిన్‌లో కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump vs Zelenskyy: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్స్కీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం చేసుకోగల కొత్త నాయకుడిని ఉక్రెయిన్ ఎన్నుకోవాలని సూచించారు. మరోవైపు రష్యా నుంచి భారీ మొత్తంలో డీజిల్ కొనుగోలు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయంపై ఉక్రెయిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రష్యాకు ఇంధన ఆదాయం పెరిగితే, ఆ డబ్బుతో యుద్ధానికి అవసరమైన ఆయుధాలను సమకూర్చుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
శనివారం వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు జెలెన్స్కీ ముందుకు రావడం లేదని విమర్శించారు. “ఒప్పందం చేసుకోగల కొత్త నాయకుడిని ఉక్రెయిన్ ఎన్నుకోవాలని నేను సూచిస్తున్నాను. కొన్ని కారణాల వల్ల జెలెన్స్కీ మాత్రం ఒప్పందం చేసుకోలేకపోతున్నారు” అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. 2022లో తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యేదే కాదని ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. ఈ యుద్ధం ప్రారంభం కావడానికి సరైన కారణం లేదని, అసమర్థత వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని విమర్శించారు.
Also Read
- US Fed Interest Rate Decision: అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం
- Spain Train Crash: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ, 46 మంది మృతి
- Cyclone Arnab: ‘అర్నబ్’ తుఫాను పేరు వెనుక అసలు కథ ఇదే.. పేరు పెట్టింది మన దేశం కాదు..
- Israel Election Exit Polls: ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహుకు షాక్?.. ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిపక్షానికి ఆధిక్యం
ఉక్రెయిన్ 30 శాతం భూభాగాన్ని కోల్పోయిందన్న ట్రంప్
జెలెన్స్కీ నాయకత్వాన్ని ప్రశ్నించిన ట్రంప్.. ఉక్రెయిన్ తన భూభాగంలో సుమారు 30 శాతం కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ఇరుపక్షాలకు చెందిన 20 లక్షల మందికి పైగా మరణించారని కూడా తెలిపారు. యుద్ధం ఎప్పుడూ ప్రారంభం కాకూడదని, ఇప్పుడు దాన్ని ముగించేందుకు ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన సమయం వచ్చిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
రష్యా దాడుల్లో 20 మంది మృతి.. చిన్నారులు కూడా!
ట్రంప్ రష్యా నుంచి డీజిల్ కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, ఉక్రెయిన్‌లో రష్యా దాడులు మరింత ఆందోళన కలిగించాయి. ఉక్రెయిన్ అధికారుల సమాచారం ప్రకారం, జపోరిజ్జియా ప్రాంతంలో రష్యా వైమానిక దాడుల్లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 18 మందికి పైగా గాయపడ్డారు. రాజధాని కీవ్‌లోనూ పగటిపూట క్షిపణి దాడి జరగగా, నలుగురు గాయపడినట్లు సమాచారం. జపోరిజ్జియా ప్రాంతంలో నివాస భవనాలను లక్ష్యంగా చేసుకుని రష్యా బాంబులు ప్రయోగించిందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. ఈ దాడులపై జెలెన్స్కీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందిస్తూ.. రష్యా ఇంధన ఎగుమతులపై ఆంక్షల సడలింపును యుద్ధాన్ని కొనసాగించేందుకు అనుమతిగా భావిస్తోందని విమర్శించారు. డీజిల్ ఎగుమతులకు సంబంధించిన ఆంక్షల సడలింపు నేపథ్యంలోనే రష్యా దాడులు చేసిందని ఆయన ఆరోపించారు.
రష్యా నుంచి భారీగా డీజిల్ కొనుగోలు చేయనున్న అమెరికా?
అమెరికాలో ఇంధన ధరలను నియంత్రించడం, మధ్యంతర ఎన్నికలకు ముందు ప్రజలకు ఉపశమనం కల్పించడం లక్ష్యంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథనంలో పేర్కొన్నారు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు గతంలో అనుసరించిన ఇంధన ఆంక్షల విధానానికి ఇది భిన్నమైన చర్యగా పరిగణిస్తున్నారు. ట్రంప్ వెల్లడించిన వివరాల ప్రకారం, రష్యా నుంచి డీజిల్ సరఫరా దశలవారీగా జరగనుంది:
మొదట 3 లక్షల టన్నులకు పైగా డీజిల్ సరఫరా.
నవంబర్‌లో మరో 5 లక్షల టన్నులు.
ఆ తర్వాత మరో 10 లక్షల టన్నుల సరఫరా.
తక్కువ వ్యవధిలో అదనంగా 30 లక్షల టన్నుల డీజిల్ సరఫరా చేయనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా-రష్యా డీజిల్ ఒప్పందంపై ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండిపెండెన్స్ స్క్వేర్‌లో యుద్ధంలో మరణించిన సైనికుల స్మారక స్థూపం వద్దకు చేరిన కొందరు.. ట్రంప్ నిర్ణయాన్ని విమర్శించారు. 26 ఏళ్ల ఒలెక్సాండర్ పెట్రెంకో మాట్లాడుతూ, ట్రంప్‌కు యుద్ధం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల కంటే చమురు, ఇంధన ధరలు, అమెరికన్లు చెల్లించాల్సిన ఖర్చులపైనే ఎక్కువ శ్రద్ధ ఉందని ఆరోపించారు. అమెరికాలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంధన మార్కెట్‌ను ప్రభావితం చేయడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడ్డారు. మరో వ్యక్తి కూడా ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని విమర్శించారు.
ఒకవైపు యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్ కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని ట్రంప్ వ్యాఖ్యానించడం, మరోవైపు రష్యా నుంచి భారీగా డీజిల్ కొనుగోలు చేసే నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. అమెరికా ఇంధన ధరలను తగ్గించే ప్రయత్నాలు చేస్తుండగా, ఉక్రెయిన్ మాత్రం రష్యాకు ఆదాయం పెరిగితే యుద్ధం మరింత కొనసాగవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామాలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారం, అమెరికా విదేశాంగ విధానం, ప్రపంచ ఇంధన మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
El Nino: భారత్‌పై “ఎల్ నినో” పంజా.. మార్చి నాటికి 55 వేల మరణాలు!
-
Trivikram Srinivas: ఆ హీరోయిన్ కాళ్లపై పడ్డారా? గురూజీ అదిరిపోయే క్లారిటీ!
-
Silver Price: కొనుగోలుదారులకు ఊరట.. వెండి ధరల్లో ఊహించని మార్పులు..
-
Rahul Gandhi: ‘లాఠీలకు భయపడొద్దు’.. నవంబర్ 1 మార్చ్‌కు వెనక్కి తగ్గేదేలేదు..
-
Vishwak Sen: ‘కల్ట్’ వైల్డ్ రైడ్.. గుండె ధైర్యం ఉంటేనే థియేటర్‌కు రండి..
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..