పాకిస్థాన్‌లో అసిమ్ మునీర్‌కు మళ్లీ ప్రమోషన్ దక్కింది. ఆర్మీ చీఫ్‌గా ఉన్న అతడు ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ పొందాడు. తాజాగా రక్షణ దళాల అధిపతిగా అసిమ్ మునీర్ ప్రమోషన్ పొందాడు. దేశ తొలి రక్షణ దళాల అధిపతి (CDF)గా ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ నియామకానికి పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదం తెలిపారు.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ ఇటీవల రాజ్యాంగ సవరణ చేసింది. నవంబర్ 13న 27వ రాజ్యాంగ సవరణ బిల్లుపై పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంతకం చేశారు. పాకిస్తాన్ ఎలాంటి చర్చ లేకుండా త్వరితగతిన ఈ సవరణలకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ దేశ సర్వసైన్యాధ్యక్షుడిగా మారడంతో పాటు సుప్రీంకోర్టు అధికారాలను తగ్గించారు. ఈ సవరణలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తూ, రానున్న కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని…
పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ప్రమాదానికి గురయ్యారు. అక్టోబర్ 30 రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం దిగుతుండగా ఒక్కసారిగా ఆయన తుళ్లిపడ్డారు. దీంతో ఆయన కాలుకి ఫ్రాక్చర్ అయింది. విమానం డీబోర్డింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్ ప్రెసిడెంట్ హౌస్ ధృవీకరించింది. అక్టోబర్ 31న ఒక ప్రకటనలో తెలిపింది. ఇది కూడా చదవండి: Ambati Rambabu: పోలవరంపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం దుబాయ్…
Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో, జనరల్ జియా ఉల్ హక్ సైనిక పాలనలో ఉరితీయబడ్డాడు. రాజకీయ నాయకుడి హత్యకు కుట్ర చేశాడనే అభియోగాలపై 1979లో లాహోర్ హైకోర్టు భుట్టోకి మరణశిక్ష విధించింది. సైనిక తిరుగుబాటుకు పాల్పడి భుట్టోని అధికారంలో నుంచి దించిన జియా ఉల్ హక్ అతనిపై అవినీతి ఆరోపణలు, ఇతర అభియోగాలు మోపాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పాకిస్తాన్ న్యాయవ్యవస్థ సరిగా పనిచేయలేదనే భావన ఉంది.
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన మంత్రివర్గంలో చేర్చుకోవడానికి 19 మంది పేర్లను అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి సిఫార్సు చేశారు. మీడియా నివేదికల ప్రకారం, ఈ పేర్లను అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఆమోదించినట్లయితే, వారు త్వరలో మంత్రిగా ప్రమాణం చేయవచ్చు.
Asif Ali Zardari: పాకిస్తాన్ అధ్యక్షుడిగా రెండోసారి ఆసిఫ్ అలీ జర్దారీ శనివారం ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో భర్తగా పేరు సంపాదించుకున్న జర్దారీ, 2007లో ఆమె బాంబు దాడిలో మరణించిన తర్వాత పాకిస్తాన్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాడు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చీఫ్‌గా ఉన్న ఆయన భార్య మరణం తర్వాత వచ్చిన సానుభూతితో 2008-13 వరకు పాక్‌కి అధ్యక్షుడిగా పనిచేశారు.
పాక్ అధ్యక్షుడిగా ( Pakistan President) మరోసారి అసీఫ్ అలీ జర్దారీ (Asif ali zardari) ఎన్నికయ్యారు. మొదటి నుంచి అధ్యక్ష పదవి రేసులో ఆయన పేరే ఎక్కువగా వినిపించింది.
తనను హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర వెనుక పాక్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ పాత్ర ఉందని అన్నారు. తనను హత్య చేసేందుకు అసిఫ్ అలీ జర్దారీ ఉగ్రవాదులకు డబ్బులు ఇచ్చారని శుక్రవారం ఆరోపించారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పదవి కోల్పోయినప్పటి నుంచి వరసగా భారత్ విదేశాంగ విధానాన్ని, పెట్రోల్ రేట్లు తగ్గించడంపై ప్రశంసిస్తున్నారు.తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం సరైన నిర్ణయాలు తీసుకోకుంటే పాకిస్తాన్ మూడు భాగాలుగా విడిపోయి.. అణ్వాయుధాలు లేని దేశంగా మారుతుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే.. ఈ దేశం నాశనం అవుతుందని నేను…