పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. దీనికి కారణం గత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అని ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆయన పార్టీ ఆరోపిస్తోంది. దేశంలో ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రయత్నిస్తున్నాడు. దీంట్లో భాగంగానే కీలక నిర్ణయం తీసుకున్నాడు.
దేశంలో తీవ్ర నగదు కొరత ఉంది. ఆర్థిక మాంద్యం పరిస్థితులను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగానే విదేశాల నుంచి దిగుమతి అయ్యే విలాసవంతమైన వస్తువులపై నిషేధం విధించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సామాన్యులు ఉపయోగించని నిత్యావసర వస్తువుల దిగుమతిపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ విధించినట్లు జియో న్యూస్ తెలిపింది.
లగ్జరీ వాహనాలు, సౌందర్య సాధానాలతో సహా ఇతర లగ్జరీ వస్తువులపై బ్యాన్ విధించారు. పెరుగుతున్న వాణిజ్య లోటు కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలోని అన్ని పార్టీల నిర్ణయం తీసకుని లగ్జరీ వస్తువుల దిగుమతిపై నిషేధం విధించినట్లు ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించానికి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.