రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్‌పై ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తిరస్కరించినట్లుగా సమాచారం. జగ్‌దీప్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష నేతలను ఆయన లక్ష్యంగా చేసుకుంటున్నారని ఇండియా కూటమి నేతలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అయితే అవిశ్వాస తీర్మానానికి 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ శీతాకాల సమావేశాల ముగింపునకు కేవలం 10 రోజుల సమమయే ఉంది. దీంతో ప్రతిపక్ష కూటమి ఇచ్చిన నోటీసును డిప్యూటీ ఛైర్మన్ తిరస్కరించారు.
ఇది కూడా చదవండి: Nara Bhuvaneswari: ‘ఒకవైపే చూడు మరోవైపు చూడకు’.. భువనేశ్వరి నోట బాలయ్య డైలాగ్..
రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని.. ప్రతిపక్ష నేతలకు మాత్రం పాఠాలు చెబుతున్నారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. దీంతో ఇండియా కూటమి నేతలు ఆయనపై అవిశ్వాస తీర్మానానికి పూనుకున్నాయి. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఇండియా కూటమిలోని పార్టీలన్నీ సంతకాలు చేశాయి. దాదాపు 50 మందికి పైగా ఎంపీలు సంతకాలు చేసి నోటీసు ఇచ్చారు. అయితే శీతాకాల సమావేశాల్లో మరో 10 రోజుల్లో ముగుస్తున్నాయి. అంటే నోటీసుకు ముందు కనీసం 14 రోజుల సమయం ఉండాలి. కేవలం 10 రోజుల సమయమే ఉండడంతో నోటీసును డిప్యూటీ ఛైర్మన్ తిరస్కరించారు.
ఇదిలా ఉంటే శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమయ్యాయి.కానీ పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం కారణంగా సభలు సాజావుగా సాగలేదు.అదానీ లంచాల వ్యవహారం ఉభయ సభలను కుదిపేశాయి. అదానీ లంచాల వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశాయి. దీంతో సభలో నిరసనలు, ఆందోళనలతో సభా సమయం వృధా అయింది.
ఇది కూడా చదవండి: Virat Kohli: బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు.. ఆస్ట్రేలియా జర్నలిస్ట్‌తో కోహ్లీ వాగ్వాదం.. కారణమేంటంటే..?