Donald Trump: ఇరాన్ నన్నే మొదట చంపాలనుకుంటోంది.. టర్కీలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- ఇరాన్ నన్నే చంపాలనుకుంటోంది
- ట్రంప్ షాకింగ్ కామెంట్స్
- ఇరాన్ దాడి చేస్తే 10 రెట్లు బలంగా బదులిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు దేశాలు పరస్పరం హెచ్చరికలు జారీ చేస్తూ, సైనిక చర్యలపై కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టర్కీలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశానికి హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. టర్కీలో మీడియాతో మాట్లాడిన ట్రంప్, “ఇరాన్ చంపాలనుకుంటున్న వారి జాబితాలో నేను నంబర్ వన్ స్థానంలో ఉన్నాను. కానీ దాని గురించి నాకు ఎలాంటి భయం లేదు. నేను నా పని చేస్తున్నాను. అమెరికా ప్రయోజనాల కోసం పని చేస్తున్నాను. టిక్‌టాక్‌లో నంబర్ వన్‌గా ఉండటం నాకు ఇష్టం, కానీ ప్రస్తుతం నేను ఇరాన్ హిట్‌లిస్ట్‌లో నంబర్ వన్‌గా ఉన్నాను” అని వ్యాఖ్యానించారు.
“దాడి చేస్తే 10 రెట్లు గట్టిగా ప్రతిస్పందిస్తాం”
ఇరాన్‌తో మళ్లీ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశంపై ప్రశ్నించగా ట్రంప్ స్పందిస్తూ, “అది మళ్లీ మొదలవుతుందని నేను అనుకోవడం లేదు. వారు కొన్ని నౌకలపై దాడి చేశారు. దానికి మేము మరింత తీవ్రంగా ప్రతిస్పందించాం. ఇకపై వారు దాడి చేస్తే, మేము 10 రెట్లు ఎక్కువ బలంగా దాడి చేస్తాం. మా వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి” అని హెచ్చరించారు.
Also Read
- NASA Swift Telescope: నాసా రెస్క్యూ విఫలం.. భూమిపై కూలిపోనున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ.!
- Trump on Iran Attack: ‘‘ముందే చెబుతానా ఏంటి?’’.. ఇరాన్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Israel PM: ఇజ్రాయెల్ ప్రధానిగా ఐసెన్‌కోట్..? కీలక నిర్ణయం దిశగా అరబ్ పార్టీలు..
- Trump Warning: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. కేవలం 10 నిమిషాల్లో అణు స్థావరాలు ధ్వంసం..
“సంఘర్షణ త్వరలోనే ముగుస్తుంది”
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. “వారు దాడి చేస్తే మేము కూడా అదే భాషలో సమాధానం ఇస్తాం. కానీ ఈ పరిస్థితి చాలా త్వరగా ముగుస్తుందని నేను భావిస్తున్నాను. ప్రపంచ చమురు సరఫరాపై కూడా ప్రభావం లేకుండా చూస్తాం” అని చెప్పారు.
హార్ముజ్ జలసంధిపై వ్యాఖ్యలు
హార్ముజ్ జలసంధి గురించి ప్రస్తావిస్తూ ట్రంప్, “ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గం సురక్షితంగా ఉండాలి. ప్రస్తుతం చమురు నిల్వలు కూడా తగినంతగా ఉన్నాయి. దీర్ఘకాలిక యుద్ధం మా లక్ష్యం కాదు” అని స్పష్టం చేశారు.
ఇరాన్‌తో ఒప్పందంపై సందిగ్ధత
ఇరాన్‌తో భవిష్యత్తులో ఒప్పందం కుదుర్చుకునే అంశంపై ట్రంప్ స్పందిస్తూ, “నేను వారితో ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నానో లేదో ఇప్పుడే చెప్పలేను. ముందుగా ప్రస్తుత పరిస్థితిని పూర్తిగా పరిష్కరించాలి. ఆ తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం” అని పేర్కొన్నారు.
“నేను అధ్యక్షుడిని కాకపోతే ఇజ్రాయెల్ ఉండేది కాదు”
ఇరాన్ అణు కార్యక్రమంపై కూడా ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదు. అలాంటి ఆయుధాలు ప్రమాదకరమైన చేతుల్లోకి వెళ్లకూడదు. నేను అధ్యక్షుడిగా లేకపోయి ఉంటే ఇజ్రాయెల్ ఈరోజు ఉండేది కాదు. అమెరికా తీసుకున్న చర్యల వల్లే ఇజ్రాయెల్ భద్రంగా ఉంది” అని ట్రంప్ అన్నారు.
అమెరికా అధ్యక్షుడి తాజా వ్యాఖ్యలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న అమెరికా-ఇరాన్ సంబంధాలపై మరింత చర్చకు దారితీశాయి. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆసక్తికరంగా మారింది.
- Tags
- Donald Trump
- Iran
- NATO
- us
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Ramayana: “డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?”.. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Simbu – Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
-
Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
-
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ కొత్త బాదుడుపై ఒక లుక్ వేయండి!
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!