North Korea: కిమ్ మామకు పిచ్చి పీక్స్.. సినిమాలు చూస్తే ఇక అంతే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: ఉత్తర కొరియా ప్రత్యేకంగా దీని గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ దేశ అధ్యక్షుడు, నియంత కిమ్ జోంగ్ ఉన్ పాలనలో అక్కడి చట్టాలను ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో ఊహకు కూడా అందవు. పాశ్చాత్య దేశాల సినిమాలు, సీరియళ్లు, టీవీ షోలు చూస్తే అక్కడ చాలా కఠిన శిక్షలు ఉంటాయి. చిన్నవారు, పెద్దవారు అనే తేడా ఉండదు. శిక్షల పరిమాణంలో తక్కువ ఉండదు. కిమ్ నిరంకుశంలో ఉత్తరకొరియా ప్రజలకు మిగతా ప్రపంచం ఒకటి ఉందనేది కూడా తెలియదు. ఇంటర్నెట్, టీవీ ఛానెళ్లు, భావ ప్రకటన అనేది అక్కడి ప్రజలు తెలియనే తెలియదు. ఒక వేళ ఎవరైనా దక్షిణ కొరియాకు సంబంధించిన ఏ టీవీ షోను చూసినా వాళ్లు మరణశిక్షే గతి.
Read Also: Deepika Padukone: పెళ్ళికి ముందు దీపికా ఎఫైర్స్.. ఏకంగా ఏడుగురితో..?
Also Read
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
ఇదిలా ఉంటే తాజాగా హాలీవుడ్ సినిమాలు చూసేందుకు పిల్లలకు అనుమతి ఇస్తే తల్లిదండ్రులు కూడా కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ విషయాన్ని రేడియో ఫ్రీ ఆసియా తెలిపింది. దేశంలోని పిల్లలు పాశ్చాత్య సినిమాలు, టీవీ కార్యక్రమాలను చూస్తూ పట్టుబడితే తల్లిదండ్రులను శిక్షిస్తామని, వారిని ఆరు నెలల పాలు లేబర్ క్యాంపులకు పంపుతామని, పిల్లలకు ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. గతంలో పిల్లలు విదేశీ సినిమాలు చూస్తూ పట్టుబడితే తీవ్ర హెచ్చరికతో తల్లిదండ్రులు తప్పించుకునే వారు. అయితే ఈసారి అలాంటిదేం లేకుండా కఠిన శిక్షలు విధిస్తామని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది.
పిల్లలను ప్రతీక్షణం తల్లిదండ్రులు చదివించాలి, లేకపోతే వారు పెట్టుబడీదారులుగా, యాంటీ సోషలిస్టులుగా మారుతారని ప్రచారం చేస్తోంది కిమ్ ప్రభుత్వం. ఎవరైనా దక్షిణ కొరియన్ లాగా కనిపించినా.. తల్లిదండ్రులు 6 నెలల పాటు శిక్ష విధించబడుతుందని వెల్లడించింది. సరిహద్దు గుండా పాశ్చాత్య మీడియాను స్మగ్లింగ్ చేస్తే ఉరిశిక్షలు కూడా విధించవచ్చు . గతేడాది ఇద్దరు టీనేజర్లు దక్షిణకొరియా, అమెరికన్ సినిమాలు చూసినందుకు అక్కడి ప్రభుత్వ వారిని స్థానికుల ముందే ఉరితీసింది. 2020 నుంచి కొరియన్ షోలపై అక్కడి నిషేధం ఉంది.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!