ChatGPT: ప్రాణాలు తీసిన ChatGPT వైద్యం.. మూర్ఛ వ్యాధితో మహిళ మృతి.. ఓపెన్ఏఐపై దావా..
- ప్రాణాలు మీదికి తెచ్చని చాట్‌జీపీటీ వైద్య సలహాలు..
- మూర్ఛ వ్యాధితో మహిళ మృతి..
- ఓపెన్ఏఐపై దావా వేసిన బాధిత కుటుంబం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ChatGPT: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సలహాలు తీసుకుని సొంత వైద్యం చేసుకుంటే ఎంత ప్రమాదమో ఈ ఘటన తెలియజేస్తోంది. చాట్‌జీపీటీ(ChatGPT) మూర్ఛ వ్యాధికి వాడే మందుల డోస్ తగ్గించుకునేలా సలహా ఇవ్వడంతోనే తమ కుమార్తె మరణించిందని ఆరోపిస్తూ ఓ కుటుంబం ఓపెన్ఏఐ(OpenAI) దావా వేసింది. కంపెనీ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ పైన న్యాయపరమైన చర్యలు చేపట్టింది.
అసలు ఏం జరిగింది..?
అమెరికాకు చెందిన 31 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ బోవెన్ వాన్ చాలా కాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతోంది. దీనికి ఆమె గత కొన్నేళ్లుగా చికిత్స తీసుకుంటోంది. ఆమె గతంలో అమెజాన్ సంస్థలో పనిచేసేది. ఆమె తన మూర్ఛ వ్యాధికి మందులు వాడుతోంది. తాను తీసుకుంటున్న మందులు తన ఇంటర్వ్యూ సామర్థ్యాలను, ఆలోచన శక్తిని దెబ్బతీస్తాయని ఆమె భయపడినట్లు కుటుంబీకులు చెప్పారు. ఉద్యోగం కోల్పోతామోననే భయం, రాబోయే ఉద్యోగ ఇంటర్వ్యూలపై ఒత్తిడితో ఆమె ఇబ్బంది పడినట్లు చెప్పారు. దీంతోనే ఆమె చాట్‌జీపీటీ సలహాతో తన మూర్ఛ వ్యాధి మందుల్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చినట్లు కుటుంబం ఆరోపిస్తోంది.
Also Read
- Bangladesh: హసీనా ప్రభుత్వం కూలకముందే యూనస్‌తో చర్చలు.. పక్కా ప్లాన్‌తో రెజిమ్ ఛేంజ్?
- Flavio Bolsonaro: అమెరికాకు పారిపోయిన బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి.. లూలా గెలుపు తర్వాత కీలక పరిణామం!
- Bangladesh: షేక్ హసీనా వీడియో వివాదం.. బంగ్లాదేశ్ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మృతి..
- US Fed Interest Rate Decision: అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం
25 రోజుల్లో డోస్ తగ్గించినట్లు ఆరోపణలు..
కుటుంబం దాఖలు చేసిన వ్యాజ్యంలో, బోవెన్ వాన్ మూర్ఛ వ్యాధి చికిత్సలో భాగంగా లామోట్రిజైన్(Lamotrigine) అనే మందును వాడుతున్నారు. ఆమె రోజువారీ మోతాదును 400 మిల్లీగ్రాముల నుంచి సున్నాకు తగ్గించేందుకు సుమారు 25 రోజుల ప్లాన్‌ను చాట్ జీపీటీ రూపొందించిందని కుటుంబం ఆరోపిస్తోంది. వైద్యుడి అనుమతి లేకుండా మందుల డోస్ తగ్గించుకునేలా చాట్‌జీపీటీ ప్రభావితం చేసిందని వారు చెబుతున్నారు. ఇదే కాకుండా, మందుల మోతాదులో చేస్తున్న మార్పుల్ని వైద్యులకు తెలియజేయకుండా ఉండాలని చాట్‌జీపీటీ సూచించినట్లు ఆరోపించారు. వైద్యులపై నమ్మకాన్ని దెబ్బతీసిందని కుటుంబం తన ఫిర్యాదులో పేర్కొంది. దీనికి ఆధారంగా తమ కూతురి చాట్‌జీపీటీ సంభాషనల్ని చూపించారు.
మూర్ఛ వ్యాధితో ఆకస్మిక మరణం..
మందుల డోస్ తగ్గించే సమయంలో బోవెన్ వాన్ గందరగోళం, సమయస్పూర్తి లోపించడం వంటి సమస్యల్ని ఎదుర్కొన్నట్లు కుటుంబం ఆరోపించింది. ఈ లక్షణాలు డోస్ తగ్గించడం వల్ల రావచ్చని చాట్‌జీపీటి చెప్పిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చిందని కుటుంబం ఆరోపించింది. బోవెన్ వాన్ ఈ క్రమంలో ఫిబ్రవరి 2026లో మరణించింది. ఆమె అపార్ట్మెంట్లో మృతదేహాన్ని గుర్తించారు. వైద్య పరిభాషలో సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఇన్ ఎపిలెప్సీ (SUDEP) అని పిలువబడే మూర్ఛవ్యాధికి సంబంధించిన ఆకస్మిక మరణమే మరణానికి కారణమని వైద్య పరీక్షకుడు నిర్ధారించారు.
OpenAI ఏం చెబుతోంది..?
ఈ ఘటనపై ఓపెన్ఏఐ విచారం వ్యక్తం చేసింది. ఈ సంఘటనలో చాట్‌జీపీటీ పాత మోడల్ అయిన GPT-40 పాలుపంచుకుందని ఆ సంస్థ పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్ని గుర్తించడం, వృతిపరమైన సహాయం కోరాలని సూచించడం వంటి అంశాల్లో కొత్త మోడళ్లు మరింత మెరుగ్గా పనిచేస్తాయని చెప్పింది.
వైద్యుల్ని AI భర్తీ చేస్తుందా?
ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలకు చాట్‌జీపీటీ వంటి ఏఐల సలహాలు తీసుకోవడం ఎక్కువైంది. ఏఐ వైద్య నివేదికల్లో పదాలను అర్థం చేసుకోవడం, డాక్టర్‌ను అడగాల్సిన ప్రశ్నల్ని సిద్ధం చేసుకోవడానికి సహాయపడొచ్చు. కానీ రోగి మెడికల్ హిస్టరీ పరిశీలించి చికిత్సను నిర్ణయించే వైద్యుడి స్థానాన్ని భర్తీ చేయలేవు. ముఖ్యంగా మూర్ఛ వంటి వ్యాధులకు సంబంధించిన మందుల్ని స్వయంగా నిలిపేయడం చాలా ప్రమాదకరం. ఏఐ సమాధానాలు నమ్మకంగా కనిపించినంత మాత్రాన ప్రతీ రోగికి ఇవి సరిపోతాయని భావించకూడదు.
తాజావార్తలు
-
ChatGPT: ప్రాణాలు తీసిన ChatGPT వైద్యం.. మూర్ఛ వ్యాధితో మహిళ మృతి.. ఓపెన్ఏఐపై దావా..
-
Diwali Bonus: దీపావళి ధమాకా.. ఆ ఉద్యోగులకు భారీగా బోనస్!
-
Vijayendra Prasad : ఏప్రిల్ 7 2027న వారణాసి తప్పకుండా రిలీజ్ అవుతుంది
-
El Nino Impact : ఎల్‌నినో దెబ్బ.. తెలంగాణలో 23.40 లక్షల ఎకరాల్లో పంట నష్టం
-
UP News: బ్లూ డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. భూమి కింద కోట్ల రూపాయల నగదు..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?