Fake Currency: విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం.. 66 లక్షల విలువైన నోట్లు పట్టివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నం మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ఓ దొంగ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జీవీఎంసీ ఎన్నికల సందర్భంగా నగరంలోని పలు లాడ్జీలు, హోటళ్లపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జగదాంబ జంక్షన్‌లోని వి-స్టార్ హోటల్‌పై పోలీసులు దాడి చేశారు. హోటల్ గది నంబర్ 105ను తనిఖీ చేయగా, అక్కడ రూ.500 నోట్ల రూపంలో ఉన్న కలర్ జిరాక్స్ నకిలీ కరెన్సీ కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం 200 కట్టల రూపంలో ఉన్న సుమారు 66 లక్షల రూపాయల విలువైన నకిలీ నోట్లతో పాటు ఒక డమ్మీ తుపాకీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కొండబాబు, సాయి, దుర్గాప్రసాద్, దినేష్ అనే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికల సమయంలో ఇలా భారీ మొత్తంలో నకిలీ కరెన్సీ బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Also Read
- Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
- చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
- Eagle Force: యూనివర్సిటీ క్యాంపస్‌లలో డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై 'ఈగిల్ ఫోర్స్' ఉక్కుపాదం
- Fake Aadhar: నిమిషాల్లో నకిలీ ఆధార్, పాన్ కార్డులు.. గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు..
ఈ నకిలీ నోట్లు ఎక్కడ ముద్రించారు? ఎవరి ద్వారా నగరానికి తీసుకొచ్చారు? ఎన్నికల వేళ ఓటర్లకు పంపిణీ చేసేందుకు వీటిని సిద్ధం చేశారా లేక ఎవరైనా వ్యాపారులను, ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించాలని భావించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా పెద్దలు ఉన్నారా, నకిలీ కరెన్సీ నెట్వర్క్ ఎక్కడి వరకు విస్తరించి ఉందనే వివరాలను రాబట్టేందుకు నిందితులను పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
-
Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
-
Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!