Nepal Crisis: నేపాల్ ప్రస్తుతం తీవ్ర గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం తర్వాత చెలరేగిన జనరల్ జెడ్ విప్లవం ప్రభుత్వాన్ని కూలదోసింది. అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమం కారణంగా.. నేపాల్ వీధుల్లో హింస, అల్లర్లు, అనిశ్చితితో నెలకొన్నాయి. దీని అతిపెద్ద ప్రభావం ఉపాధి కోసం నేపాల్ నగరాలు, పట్టణాలకు వెళ్లి.. పనిచేస్తున్న భారతీయ కార్మికులపై పడింది. రోజు రోజుకూ పరిస్థితి దిగజారడంతో కార్మికులు భారత్ కు కాలినడకన తిరిగి రావడం ప్రారంభించారు.
AP People Returned From Nepal: నేపాల్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న తెలుగు ప్రజలు ప్రభుత్వం చొరువతో స్వస్థలాలకు చేరుకున్నారు. తాము అక్కడ ఉన్నన్ని రోజులు భయం భయంగా గడిపామని.. రోడ్లపై రాడ్లు, ఇతర ఆయుధాలతో ఆందోళనకారులు తిరుగుతున్నారని తెలుగు యాత్రికులు తెలిపారు. మరవైపు రాష్ట్రానికి చేరుకున్న యాత్రికులకు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర అధికారులు వారికి స్వాగతం పలికారు. జన్ జెడ్ ఆందోళనలో భాగంగా నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.…
నేపాల్లో నెలకొన్న అల్లర్లు, రాజకీయ అస్థిరత నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం అక్కడి పౌరులకు అండగా నిలిచింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఒక ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది.
Breaking News: సోషల్ మీడియా బ్యాన్‌తో నేపాల్‌లో ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. జెన్ జెడ్ యువత ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సోమవారం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. ఆందోళనకారులు ప్రధాని కేపీ శర్మ ఓలి నివాసంతో పాటు అధ్యక్ష, సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలపై దాడి చేసి, నిప్పటించారు.
Nepal Gen Z protests: నేపాల్లో సోషల్ మీడియాపై బ్యాన్ విధించడంతో, జెన్-జీ యువత చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. రాజధాని ఖాట్మాండుతో పాటు దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు అంటుకున్నాయి. యువత రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. సోమవారం 19 మంది ఆందోళనకారులు చనిపోయిన తర్వాత, హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు ప్రధాని, అధ్యక్షుడు ఇళ్లతో పాటు సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలకు నిప్పుపెట్టారు.
Nepal Protest: గత మూడేళ్లుగా భారత్ తప్పా, భారత్ చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు ఈ సంఘటనలు ఆ దేశాల్లో ప్రభుత్వ మార్పుకు కారణమయ్యాయి. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇప్పుడు నేపాల్ ఇలా వరసగా అల్లర్లతో అట్టుడుకుతున్నాయి.