ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తి స్థాయిలో కోలేకోలేదు.. కొన్ని దేశాల్లో తగ్గుముఖం పట్టినా.. మరికొన్ని దేశాల్లో దాని విజృంభణ కొనసాగుతూనే ఉంది.. కఠిన ఆంక్షలు, లాక్‌డౌన్లతో సామాన్యులు అల్లాడిపోతూనే ఉన్నారు.. అయితే, కరోనాను కట్టడి చేసేందుకు రకరాల వ్యాక్సిన్లు, పౌండర్లు.. ఇలా అందుబాటులోకి వచ్చాయి… సింగిల్ డోస్, డబుల్ డోస్.. బూస్టర్ డోస్ వేయించుకోవాల్సిన పరిస్థితి.. ఇప్పుడు కొత్తగా ఓ స్ప్రేను రూపొందించారు.. ఆ స్ప్రేను పీలిస్తే చాలు.. కరోనా దరిచేరదని చెబుతున్నారు పరిశోధకులు.
Read Also: Bandi Sanjay: మంత్రి పువ్వాడపై హత్య కేసు నమోదు చేయాల్సిందే..!
బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకులు తాజాగా ఓ స్ప్రేను తయారు చేశారు.. కోవిడ్ వైరస్ ఊపిరితిత్తుల్లోకి చొరబడకుండా అడ్డుకునేందుకు ఈ స్ప్రే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.. ఈ స్ప్రే పీలిస్తే చాలు, ఇందులోని ఎన్-0385 అనే రసాయన ప్రభావం చూపడం స్టార్ అవుతుందని.. వైరస్‌ను నిర్వీర్యం చేస్తుందని వెల్లడించారు.. ఇక, దీనికి సంబంధించిన పరిశోధనులు కూడా జరిగినట్టు చెబుతున్నారు.. ఇప్పటికే ఈ మందును ఎలుకల మీద, మనుషుల ఊపిరితిత్తులను పోలిన కణజాలం మీద విజయవంతంగా ప్రయోగించామని.. మంచి ఫలితాలు ఇస్తుందంటున్నారు.. ఒమైక్రాన్‌తో పాటు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్ల మీద కూడా తిరుగులేని ప్రభావం చూపిందని చెబుతున్నారు పరిశోధకులు.. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ముగిసి.. ఫోర్త్ వేవ్ ముప్పు కూడా తప్పదనే హెచ్చరికలు, అంచనాల మధ్య.. ఈ స్ప్రే రావడం గుడ్‌న్యూస్‌గానే చెప్పుకోవాలి.