ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తి స్థాయిలో కోలేకోలేదు.. కొన్ని దేశాల్లో తగ్గుముఖం పట్టినా.. మరికొన్ని దేశాల్లో దాని విజృంభణ కొనసాగుతూనే ఉంది.. కఠిన ఆంక్షలు, లాక్‌డౌన్లతో సామాన్యులు అల్లాడిపోతూనే ఉన్నారు.. అయితే, కరోనాను కట్టడి చేసేందుకు రకరాల వ్యాక్సిన్లు, పౌండర్లు.. ఇలా అందుబాటులోకి వచ్చాయి… సింగిల్ డోస్, డబుల్ డోస్.. బూస్టర్ డోస్ వేయించుకోవాల్సిన పరిస్థితి.. ఇప్పుడు కొత్తగా ఓ స్ప్రేను రూపొందించారు.. ఆ స్ప్రేను పీలిస్తే చాలు.. కరోనా దరిచేరదని చెబుతున్నారు…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఇప్పటికే అనేక ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సిన్ రూపంలో వీటిని అందిస్తున్నారు. ఇండియాలో సీరం కోవీషీల్డ్, భారత్ బయోటెక్ కోవాగ్జిన్, జైడస్ క్యాడిలా జైకొవ్ డీ అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఇతర దేశాలకు చెందిన వ్యాక్సిన్లు కూడా ఇండియాలో అందుబాటులోకి వచ్చాయి. అయితే, చాలా మంది వ్యాక్సిన్‌ను ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడానికి ఇష్టపడరు. దీంతో ప్రత్నామ్నాయంగా మరికొన్ని పద్ధతుల్లో వ్యాక్సిన్ తయారు చేయడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. Read: మళ్లీ…