ఈ విశ్వం గురించి ఎంత పరిశోధనలు చేసినా ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు, పరిశోధించాల్సిన అంశాలు అనేకం ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. భూమిని పోలిన గ్రహాలు ఈ విశ్వంలో అనేకం ఉండోచ్చు. వాటి గురించి నాసా వంటి సంస్థలు పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే, అంతరిక్షంలో నాసా, యూరోపియన్ యూనియన్ దేశాలు కలిసి అంతరిక్షకేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. ఈ అంతరిక్ష కేంద్రంలో నాసా అనేక ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నది. అక్కడ ఉండే పరిశోధకుల కోసం అంతరిక్షకేంద్రంలోనే ఆహారాన్ని పండించుకునే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నది. దుంపలు, ఆకుకూరలు, పూలు పండించిన నాసా, ఇప్పుడు మిర్చిని పండించేందుకు సిద్ధం అయింది.
Read: మొన్న సందీప్ రెడ్డి… నేడు సంకల్ప్ రెడ్డి… బాలీవుడ్ లోకి తెలుగు డైరెక్టర్స్!
అంతరిక్షంలో మిర్చిని పండించడం సాధ్యంకాదని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో దానిని సాధ్యం చేసేందుకు నాసా పరిశోధకులు సిద్ధం అయ్యారు. అంతరిక్ష కేంద్రంలో కిచెన్ ఓవెన్ సైజ్‌లో ఉండే డివైజ్‌లో మిర్చిని పండించేందుకు నాసా ప్రయత్నాలు మొదలుపెట్టింది. మెక్సికన్ రకానికి చెందిన హాచ్చ్ రకపు మిర్చిని పండించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మిర్చి పూర్తిగా ఎదిగి కాయలు కాయడానికి కనీసం నాలుగు నెలల సమయం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మరిన్ని స్పైసీ పంటలు పండించేందుకు నాసా ప్రయత్నిస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.