ఇస్రో, నాసా మిషన్ ఆక్సియం-04 కింద అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లిన శుభాంశు శుక్లా, తన సిబ్బందితో కలిసి భూమిపైకి తిరిగి రానున్నాడు. అంతరిక్ష నౌక ఈరోజు భూమికి పయనమవుతుంది. అంతరిక్ష పరిశోధన విజ్ఞానంలో భారత్ సాధించిన మరో ఘన విజయం ఇది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ISS) సందర్శించిన భారత అంతరిక్షయాత్రికుడు గ్రూప్ కప్టెన్ శుభాంశు శుక్లా.. “యాక్సిమ్ -4” మిషన్ (Undocking) “అన్ డాకింగ్” ప్రక్రియ నేడు మధ్యాహ్నం 4.30 గంటలకు ప్రారంభం…
Shubhanshu shukla: ఆక్సియం-4 మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురు అస్ట్రోనాట్స్ జూలై 14వ తేదీన భూమి పైకి తిరిగి రాబోతున్నారని నాసా ప్రకటించింది.
అంతరిక్షంలోకి తన చారిత్రాత్మక ప్రయాణానికి కొన్ని గంటల ముందు.. తన తల్లిదండ్రులతో శుభాంశు శుక్లా మాట్లాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లే స్పేస్‌ఎక్స్ అంతరిక్ష నౌకలో ఎక్కడానికి సిద్ధమైన ఆయన.. వీడియో కాల్‌లో తన కుటుంబానికి ‘నా కోసం వేచి ఉండండి. నేను వస్తున్నా’ అని సందేశం ఇచ్చారు. శుభాంశు తల్లి చక్కెర, పెరుగు కలిపిన పదార్థాన్ని ఆయనకు వీడియో కాల్‌లో వర్చువల్‌గా తినిపించారు. చాలా మంది భారతీయులు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు…
ఆక్సియం-4 మిషన్ ప్రయోగం మళ్లీ వాయిదా పడింది. జూన్ 22 ఆదివారం జరగాల్సిన ఆక్సియం మిషన్ 4 ప్రయోగాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వాయిదా వేసింది. నాసా, ఆక్సియం స్పేస్, స్పేస్‌ఎక్స్ ప్రతిపాదిత ప్రయోగాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాయి. ఇప్పుడు ఈ ప్రయోగం రాబోయే రోజుల్లో కొత్త ప్రయోగ తేదీని త్వరలో ప్రకటిస్తామని నాసా తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) యొక్క జ్వెజ్డా సర్వీస్ మాడ్యూల్ వెనుక భాగంలో ఇటీవల మరమ్మతులు చేసిన తర్వాత,…
ఆక్సియం-4 మిషన్ ప్రయోగం వాయిదా పడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆక్సియం-4 మిషన్ ప్రయోగం ప్రతికూల వాతావరణం కారణంగా ఒక రోజు వాయిదా పడింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన అధికారిక X హ్యాండిల్ ద్వారా ఈ సమాచారాన్ని అందించింది. ‘వాతావరణ పరిస్థితుల కారణంగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారతీయ గగన్ యాత్రిని పంపే ఆక్సియం-4 మిషన్ ప్రయోగం జూన్ 10కి బదులుగా జూన్ 11కి వాయిదా పడింది. తదుపరి ప్రయోగ సమయం జూన్…
భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా, ఆక్సియం-4 మిషన్‌లోని మరో ముగ్గురు సభ్యులు అంతరిక్ష ప్రయాణానికి ముందు క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ సమాచారాన్ని అమెరికన్ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఆక్సియం స్పేస్ వెల్లడించింది. సిబ్బంది ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడమే క్వారంటైన్ ఉద్దేశ్యం. ఇది అంతరిక్ష కార్యకలాపాల భద్రత, విజయాన్ని నిర్ధారించే ప్రామాణిక ప్రక్రియ. ఆక్సియం-4 మిషన్ ద్వారా వ్యోమగాములు జూన్ 8న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:41 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి డ్రాగన్…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో అడుగుపెట్టిన మొట్ట మొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డుకెక్క బోతున్నాడు. స్పేస్‌ఎక్స్(SpaceX) సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌కు పైలట్‌గా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనుమతి కూడా ఇటీవల లభించింది.
ప్రపంచమంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న సుధీర్ఘ విరామానికి తెరపడింది. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చింది. బుచ్ విల్మోర్ కూడా ఆమెతో తిరిగి వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు క్యాప్సూల్స్ ఫ్లోరిడా తీరంలో విజయవంతంగా ల్యాండింగ్ అయ్యింది. ఇద్దరు వ్యోమగాములతో స్పేస్‌ఎక్స్ క్రూ-9 భూమికి తిరిగి వచ్చింది. అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి రావడానికి 17 గంటలు పట్టింది. క్యాప్సుల్స్ సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. నాసా సిబ్బంది…
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమ్మీదకు బయల్దేరింది. మరికొన్ని గంటల్లో ఆమె భూమ్మీద ల్యాండ్ కాబోతుంది. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా రానున్నారు.
అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ ను తిరిగి తీసుకొచ్చే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోతోంది నాసా. 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి తిరిగి రావడానికి మార్గం సుగమం అయ్యింది. సునీత విలియమ్స్‌ను తీసుకొచ్చేందుకు నాసా వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. క్రూ-10 ప్రయోగానికి నాసా రెడీ అవుతోంది. సాంకేతిక సమస్యతో…