మొన్న సందీప్ రెడ్డి… నేడు సంకల్ప్ రెడ్డి… బాలీవుడ్ లోకి తెలుగు డైరెక్టర్స్!

బాలీవుడ్ సౌత్ సినిమాల్ని రీమేక్ చేయటం పరిపాటే. కానీ, సౌత్ డైరెక్టర్స్ ని కూడా ఈ మధ్య ముంబై ఆహ్వానిస్తున్నారు బీ-టౌన్ ఫిల్మ్ మేకర్స్. పోయిన సంవత్సరం కోలీవుడ్ నుంచీ లారెన్స్ వెళ్లి ‘లక్ష్మీ’ సినిమా అక్షయ్ కుమార్ తో పూర్తి చేసి వచ్చాడు. నెక్ట్స్ మరో కోలీవుడ్ దర్శక ద్వయం గాయత్రి, పుష్కర్ తమ ‘విక్రమ్ వేద’ సినిమా హృతిక్, సైఫ్ తో హిందీలో రీమేక్ చేయబోతున్నారు.
కొత్తగా బాలీవుడ్ వెళ్లి సత్తా చాటుతోన్న డైరెక్టర్స్ లిస్టులో మన తెలుగు వారు కూడా ఉన్నారు. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి ‘కబీర్ సింగ్’తో ఎలాంటి సంచలనం సృష్టించాడో తెలిసిందే కదా! ఇప్పుడు అదే బాటలో మరో తెలుగు టాలెంటెడ్ టెక్నీషియన్ ముంబై బాట పట్టాడు. అతనే… సంకల్ప్ రెడ్డి…

‘ఘాజీ’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన డిఫరెంట్ ఫిల్మ్ మేకర్ సంకల్ప్ రెడ్డి తొలి హిందీ చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఆయనే ఫస్ట్ టైం ప్రోడ్యూసర్ గా మారి తన స్వంత బ్యానర్ యాక్షన్ హీరో ఫిల్మ్స్ పతాకంపై ‘ఐబీ 71’ అనే చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. నిర్మాతగా డెబ్యూ మూవీని మన సంకల్ప్ రెడ్డితో తెరకెక్కించబోతున్నాడు ‘కమాండో’ స్టార్.
ఇప్పటికే తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి బాలీవుడ్ లో దుమారం రేపాడు. చూడాలి మరి, ‘ఘాజీ’ లాంటి చిత్రంతో ఇంతకు ముందే తన టాలెంట్ బాలీవుడ్ ప్రేక్షకులకి రుచి చూపించిన సంకల్ప్ రెడ్డి… ఎటువంటి ఎంట్రీ ఇస్తాడో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-