Nasa Moon Mission postponed: నాసా మూన్ మిషన్ వాయిదా.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చందమామపైకి ఆర్టెమిస్ 1 పేరుతో అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన మూన్ మిషన్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చందమామపైకి మళ్లీ మనిషిని పంపే బృహత్తర కార్యక్రమం చేపట్టింది. అయితే ఈ ప్రయోగానికి ఆటంకాలు ఎదురయ్యాయని తెలుస్తోంది. ఆర్టెమిస్-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది.
అయితే ఈ ప్రయోగానికి ఉపయోగించే ఇంధన ట్యాంకర్లో లీకేజీలు ఏర్పడ్డాయని తెలుస్తోంది. ఈ కారణంగా పలుమార్లు ప్రయోగానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. వీటిని పరిష్కరిస్తూ ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు నాసా తొలుత ప్రకటించింది. అయితే, చివరికి రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేయక తప్పలేదు. అయితే, అనుకున్న విధంగా సోమవారం(ఆగస్టు 29)న ప్రయోగం నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. తదుపరి తేదీపై త్వరలోనే స్పష్టత ఇస్తామని నాసా వెల్లడించింది.
Also Read
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్‌లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్‌న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
Read Also: Nasa Moon Mission postponed: నాసా మూన్ మిషన్ వాయిదా.. ఎందుకంటే?
ఫ్లోరిడాలోని నాసా కెనెడీ అంతరిక్ష కేంద్రంలో ఇప్పటికే లాంచ్‌పాడ్‌పై రాకెట్‌ను రెడీగా ఉంచారు. పిడుగులు తాకినా రాకెట్కుగాని, ఓరియన్ క్యాప్సూల్కుగాని నష్టం వాటిల్లలేదని నాసా తెలిపింది. రాకెట్ ప్రయోగం ఇక పూర్తవుతుందని భావించిన నేపథ్యంలో రాకెట్లో ఇంధనం లీక్ అయినట్లు గుర్తించారు. సూపర్ కోల్డ్ హైడ్రోజన్, ఆక్సిజన్ లీక్ అవ్వడం వల్ల ప్రయోగాన్ని వాయిదా వేశారు. రీహార్సల్స్ నిర్వహించినప్పుడు ఇంధన లీకేజీ జరిగింది. ఉదయం, నాలుగు ప్రధాన ఇంజిన్లు, పెద్ద ఇంధన ట్యాంకు ఉన్న ప్రాంతంలో పగుళ్లు లేదా లోపాలు గుర్తించినట్లు నాసా అధికారులు వెల్లడించారు. వాస్తవానికి ఈ మిషన్ వ్యవధి.. 42 రోజులు, 3 గంటల.. 20 నిమిషాలు పడుతుంది. 1.3 మిలియన్ మైళ్లు ప్రయాణిస్తుంది. అక్టోబర్ 10న వ్యోమనౌక కాలిఫోర్నియా తీరానికి చేరువలో ఫసిఫిక్ మహాసముద్రంలో పడుతుంది. ప్రయోగం తిరిగి ఎప్పుడు నిర్వహిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్‌పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!