ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పెంపుడు కుక్క వైట్ హౌజ్‌లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు 10సార్లు సిబ్బందిని కరవడంతో ఆ శునకాన్ని వైట్‌హౌజ్ నుంచి తరలించారు. తరచూ వైట్ హౌజ్ బధ్రతా సిబ్బందిని కరుస్తూ అది వార్తల్లో నిలిచింది. తాజాగా యూరప్ అధ్యక్షురాలి పెంపుడు శునకం కూడా వార్తల్లో నిలిచింది. మాల్డోవా అధ్యక్షురాలు మైయా సందు పెంపుడు కుక్క ఏకంగా ఆస్ట్రియా ప్రధానినే కరిచింది. ఆస్ట్రియా ప్రధాని అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్ ప్రస్తుతం మాల్డోవాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాల్డోవా అధ్యక్షురాలితో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించిన వారిద్దరు.. అనంతరం అధ్యక్ష నివాస ప్రాంగణంలో సరదాగా సంభాషించుకున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రియా ప్రధాని వాన్ డెర్ బెలెన్ మల్డోవా శూనకాన్ని దగ్గరకు తీసుకుండగా అది ఆయన చేతిని కరిచినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో తన పెంపుడు శునకం వాన్ డెర్ బెలెన్ కరవడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఆయనకు మైయా క్షమాణలు చెప్పారు. ఇదే ఘటనపై ఆస్ట్రియా అధ్యక్షుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తనకు పెంపుడు కుక్కలంటే ఇష్టమన్నారు. ఈ క్రమంలో దానికి తీసుకుంటున్న క్రమంలో ఉత్సాహంతో ఆ శునకం తనని కరిచిందని అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్ తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నారు.