రష్యాలో తప్పిపోయిన భారతీయ విద్యార్థి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. ఉఫా నగరంలో నది ఒడ్డున భారతీయ విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. ఈ మేరకు రష్యాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. విద్యార్థి చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.
ఇది కూడా చదవండి: Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో టెక్నికల్ సమస్య.. విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం
అజిత్ సింగ్ చౌదరి(22) రాజస్థాన్‌లోని అల్వార్‌లోని లక్ష్మణ్‌గఢ్ నివాసి. 2023లో ఎంబీబీఎస్ చదివేందుకు రష్యాలోని బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చేరాడు. అక్టోబర్ 19న ఉఫా నగరంలో అదృశ్యమయ్యాడు. ఉదయం 11 గంటల ప్రాంతంలో పాలు కొనేందుకు బయటకు వెళ్తున్నట్లు హాస్టల్‌లో చెప్పి బయటకు వెళ్లాడు. కానీ ఎన్ని గంటలైనా తిరిగి రాలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఇది కూడా చదవండి: Bihar Elections: రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదు.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం!
కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టగా 19 రోజుల తర్వాత ఉఫా నగరంలో నది ఒడ్డున అజిత్ సింగ్ చౌదరి మృతదేహం లభ్యమైంది. నది ఒడ్డున బట్టలు, మొబైల్ ఫోన్, బూట్లు లభించాయి. అజిత్ సింగ్ చౌదరి చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులకు భారత రాయబార కార్యాలయం తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
విద్యార్థి మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలని కాంగ్రెస్ నాయకుడు జితేందర్ సింగ్ అల్వార్.. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కోరారు. విద్యార్థి మృతిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబం ధైర్యంగా ఉండాలని ప్రార్థించారు. ఇదిలా ఉంటే విద్యార్థి మరణం గురించి యూనివర్సిటీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
रूस में दिवाली से लापता अलवर के लक्ष्मणगढ़ निवासी और MBBS के छात्र अजीत सिंह चौधरी का शव मिलने की ख़बर से मन व्यथित है।
कफ़नवाड़ा गाँव के अजीत को उनके परिवार ने बड़ी उम्मीदों और परिश्रम के साथ पैसे जुटाकर डॉक्टरी की पढ़ाई करने के लिए रूस भेजा था। करीब 19 दिन पहले वहाँ नदी किनारे…
— Jitendra Singh Alwar (@JitendraSAlwar) November 6, 2025