దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ప్రతిరోజూ 1,500కి పైగా విమాన రాకపోకలు జరుగుతుంటాయి. అయితే గురువారం సాయంత్రం నుంచి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. శుక్రవారం కూడా అదే సమస్య కొనసాగుతోంది. దీంతో విమాన రాకపోకల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. అయితే సమయానికి గమ్యస్థానాలకు చేరుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కరించాలంటూ సోషల్ మీడియా వేదికగా అధికారులను కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: Prashant Kishor: 14న నేను చెప్పిందే నిజమవుతుంది.. పోలింగ్‌పై ప్రశాంత్ కిషోర్ జోస్యం
ప్రస్తుతం 100 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని.. అలాగే టెక్నికల్ సమస్యను కూడా పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ ఏటీసీ వ్యవస్థలో సాంకేతిక సమస్య కారణంగా రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తాయని ఎయిరిండియా తెలిపింది. ప్రయాణికుల అంతరాయానికి చింతిస్తున్నామని.. మీ సహనానికి ధన్యవాదాలు అంటూ పేర్కొంది. వీలైనంత మట్టుకు తగినంత సహాయం చేసేందుకు క్యాబిన్ సిబ్బంది, ఆన్-గ్రౌండ్ సిబ్బంది కృషి చేస్తారని తెలిపింది.
ఇది కూడా చదవండి: Trump-Modi: మోడీపై మరోసారి ట్రంప్ ప్రశంసలు.. భారత్‌లో పర్యటనపై హింట్