కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి బయటపడేందుకు వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కేసులు కంట్రోల్ కావడంలేదు. గబ్బిలాల నుంచి ఈ వైరస్ మనుషులకు సంక్రమించి అక్కడి ప్రపంచం మొత్తానికి వ్యాపించింది. అయితే, ఇప్పుడు గబ్బిలాల నుంచి మార్బర్గ్ అనే మరో వైరస్ వ్యాపిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ. పశ్చిమాఫ్రికాలోని గినియా దేశంలో మార్బర్గ్ వైరస్‌ను గుర్తించారు. ఈ వైరస్‌తో ఓ వ్యక్తి ఆగస్టు 2 వ తేదీన మరణించినట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొన్నది. ఈ వైరస్ సోకిన వ్యక్తి జ్వరంతో పాటుగా రక్తనాళాలు చిట్లిపోతాయి. దీంతో మరణం సంభవిస్తుంది.
Read: శ్రీదేవి సోడా సెంటర్: ఆకట్టుకున్న మెలోడీ సాంగ్..!
ఎబోలా జాతికి చెందిన వైరస్ కావడంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన చెందుతోంది. గత రెండు నెలలుగా గినియా దేశంలో ఎబోలా నుంచి ముప్పు తప్పిందని అనుకున్న తరుణంలో ఎబోలా జాతికి చెందిన మార్బర్గ్ వైరస్ వ్యాపిస్తుండటంతో అప్రమత్తం అయింది ప్రభుత్వం. పళ్లుతినే గబ్బిలాల నుంచి ఈ వైరస్ సోకుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ వైరస్ సోకితే 24 నుంచి 88 శాతం వరకు మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఈ వైరస్ సోకితే అందించాల్సిన చికిత్సగాని, వ్యాక్సిన్ గాని లేదని, అందుబాటులో ఉన్న ప్రత్యామ్మాయాలతోనే చికిత్స చేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొన్నది. కరోనా మాదిరిగానే ఈ వైరస్ కూడా మనిషి నుంచి మనిషికి వ్యాపించే అవకాశాలు ఉన్నాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చిరిస్తున్నారు నిపుణులు.