Many crushed to death, dozens in cardiac arrest after Halloween stampede in Seoul: దక్షిణ కొరియాలో హాలోవీన్ ఉత్సవాలు తొక్కసలాటకు కారణం అయ్యాయి. రాజధాని సియోల్ లోని ఓ ఇరుకు వీధిలోకి ఒక్కసారిగా ప్రజల గుంపు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 100 మంది వరకు గాయపడ్డారు. అయితే జనాల తొక్కిసలాట, ఇరుకు వీధిలోకి పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో చాలా మంది ప్రజలు భయపడిపోయారు. దాదాపుగా 50 మందికి గుండె పోటు సంభవించినట్లు సమాచారం. ఇటావాన్ లీజర్ డిస్ట్రిక్ట్ లో శనివారం ఈ ఘటన జరిగింది. చాలా మంది ప్రజలు కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. శ్వాస తీసుకోవడం చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 81 అత్యవసర కాల్స్ వచ్చినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
Read Also: Punith Rajkumar: తెనాలిలో ఆకట్టుకుంటోన్న పునీత్ రాజ్‌కుమార్ 21 అడుగుల విగ్రహం
సియోల్ లోని హామిల్టర్ హోటల్ సమీపంలో ఇరుకైన సందులో ఒకేసారి గుంపులుగా ప్రజలు రావడంతో ఈ ఘటన జరిగింది. పదుల సంఖ్యలో ప్రజలు మరణించినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మృతుల సంఖ్యను ఇంకా వెల్లడించలేదు. చాలా మందికి తొక్కిసలాటలో శ్వాస ఆడకపోవడంతో వైద్య సిబ్బంది సీపీఆర్ నిర్వహించారు. గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారికి త్వరితగతిన చికిత్స అందించాలని, భద్రతను సమీక్షించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు సమీపంలోని అన్ని ఆస్పత్రుల్లో వైద్య బృందాలను , పడకలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. హాలోవీన్ ఉత్సవాల సందర్భంగా దాదాపుగా లక్ష మంది ప్రలజు ఇటావాన్ వీధుల్లోకి చేరుకున్నారని అక్కడి మీడియా నివేదించింది. ఇటీవల ఆ దేశంలో కోవిడ్ నిబంధనలు సడలించిన తర్వాత జరుగుతున్న పెద్ద పెద్ద ఎత్తున హాలో వీన్ ఉత్సవాలు జరుగుతున్నాయి.
Dozens of people reportedly suffering mysterious cardiac arrest symptoms during Halloween celebrations in Seoul, South Korea. pic.twitter.com/qCCgzxeZzW
— Frida Ghitis (@FridaGhitis) October 29, 2022