చాలా రోజుల తర్వాత వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో బహిరంగంగా కనిపించారు. బుధవారం అర్ధరాత్రి నార్వే రాజధాని ఓస్లోలోని గ్రాండ్ హోటల్ దగ్గర ప్రత్యక్షమయ్యారు.
ఈ ఏడాది అనూహ్యంగా నోబెల్ శాంతి బహుమతి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోను వరించింది. కానీ మచాడోకు విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. మచాడోపై వెనిజులా దేశం ఆంక్షలు విధించింది. దీంతో ఆమె అవార్డు అందుకోలేని పరిస్థితి ఏర్పడింది.
వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమానికి మహాత్మాగాంధీనే ప్రేరణ అని 2025 నోబెల్ శాంతి గ్రహీత మరియా కొరినా మచాడో అన్నారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ‘‘శాంతి అంటే బలహీనత కాదు.. మహాత్మా గాంధీ మానవత్వం అంటే ఏమిటో చూపించారు.’’ అని మచాడో అన్నారు.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడోకు అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేసి అభినందించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘంగా మచాడోతో మాట్లాడినట్లు నివేదికలు అందుతున్నాయి. దీనిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.