కరోనా అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. కరోనా వైరస్‌లో కొత్త కొత్త వేరియంట్‌లు పుట్టుకొస్తున్నాయి. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, డెల్టా ప్లస్, ఇప్పుడు లాంబ్డా వేరియంట్ ప్రజలను భయపెడుతున్నది. అయితే, ఈ వేరియంట్ మొదట పెరూ దేశంలో బయటపడింది. పెరూలో వచ్చిన కేసుల్లో 80 శాతం ఈ వేరియంట్ కేసులు ఉన్నాయి. ఆ తరువాత అక్కడి నుంచి ఈ వేరియంట్ చిలీ, ఈక్వెడార్, అర్జెంటైనాతో సహా 29 దేశాలకు వ్యాపించింది. ఇప్పుడు బ్రిటన్‌లో ఈ కేసులు బయటపడుతున్నాయి.
Read: శరత్ మండవ, రవితేజ ప్రాజెక్ట్ షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్…!!
ఈ స్పైక్ ప్రోటీన్‌లో ఎల్ 452క్యూ, ఎఫ్ 490 ఎస్ తో పాటు పలు ఉత్పరివర్తనాలు ఉండటంతో దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టిసారించింది. ఈ లాంబ్డా వేరియంట్‌ను వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా ప్రకటించింది. దీనిపై బ్రిటన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దీని ప్రభావం, తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, అజాగ్రత్తగా ఉంటే, ఇదికూడా ప్రమాదకారిగా మారే అవకాశం ఉంటుందని, అందుకే పూర్తిస్థాయిలో ఈ లాంబ్డారకం వేరియంట్లపై పరిశోధన చేస్తున్నట్టు లండన్ పరిశోధకులు చెబుతున్నారు.