Viral news: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న చర్చ ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం. ఈ నేపథ్యంలో ఖలిస్థానీ ఉగ్రవాది అనాలోచితంగా మాట్లాడుతున్నాడు. ఇజ్రాయిల్ పైన హమాస్ చేస్తున్న దాడిలా తమ దాడి కూడా ఉంటుందని భారత్ కి హెచ్చరికలు జారీచేస్తున్నాడు. అసలు ఎవరు ఈ ఉగ్రవాది..? అనే విషయాలు ఇప్పుడు తెలిసుకుందాం. వివరాలలోకి వెళ్తే.. యూఎస్ నుండి నిషేదినచబడ్డ సిక్కులు అందరూ కలిసి ఓ సంస్థని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంస్థే నిషేధిత యూఎస్ ఆధారిత సిక్కుల జస్టిస్ సంస్థ. ఈ సంస్థ చీఫ్ గా ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ విధులు నిర్వహిస్తారు. అయితే తాజాగా గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఓ వీడియోని సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో పంజాబ్ విషయంలో భారత్ ఇలాగే ప్రవర్తిస్తే హమాస్ దాడి లాంటి ప్రతిస్పందన దాడిని ఎదుర్కోవాల్సి వస్తుందని పన్నూన్
హెచ్చరించాడు.
Read also:Israel–Hamas war: హమాస్ ఆర్థిక మంత్రిని చంపిన ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్..
సిక్కులు చేసే దాడులకు ప్రధాని మోదీ బాధ్యత వహించాల్సి వస్తుందని పేర్కొన్నాడు. అలానే సిక్కుల జస్టిస్ సంస్థ ఓటును విశ్వసిస్తుందని వీడియోలో తెలిపిన పన్నూన్.. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ పై దాడి చేస్తామని బెదిరించాడు. ఈ నేపధ్యలో ఆయనపై అహ్మదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా కెనడా దేశంలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ ను హత్య చేసినందుకుగాను సిక్కుల సంస్థ ప్రతీకారం తీర్చుకుంటుందని పన్నూన్ హెచ్చరించారు. పన్నూన్ అమృత్‌సర్‌లో జన్మించాడు. కాగా 2019వ సంవత్సరం నుంచి ఖలిస్తానీ ఉగ్రవాదిగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పన్నూన్ పై 2021 వ సంవత్సరం ఫిబ్రవరి 3వతేదీన నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేయగా . గత ఏడాది నవంబర్ 29వ తేదీన పన్నూన్ ను మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది ఎన్ఐఏ .