India-Canada: భారత్- కెనడా దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో అక్కడి హిందూ ఆలయంపై దాడి జరగడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇక, ఈ అంశంపై పార్లమెంట్‌లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా దక్షిణాసియా కమ్యూనిటీల్లో మనం చూసిన హింసాత్మక ఘటన గురించి చర్చించుకోవాలన్నారు. కానీ, కెనడాలో హిందూ, సిక్కు సమాజంలో హింసను ప్రేరేపించే, విభజనను సృష్టించే వ్యక్తులకు తావు ఉండదని తెలిపారు.
Read Also: Medicover Hospital: డెడ్ బాడీ కావాలంటే రూ. 4లక్షలు కట్టండి.. ఠాగూర్ సీన్ రిపీట్..
ఇక, బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంపై జరిగిన దాడి గురించి మాత్రం ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ప్రస్తావించలేదు. ఈ దాడి గురించి ఇంతకు ముందు కూడా ట్రూడో రియాక్ట్ అయ్యారు. తమ దేశంలో అన్ని మతాలను పాటించే వారి హక్కులను కాపాడతామని వెల్లడించారు. మరోవైపు కెనడా ఎంపీ చంద్ర ఆర్య మాట్లాడుతూ.. కెనడాలో ఎంత తీవ్రస్థాయిలో హింసాత్మక తీవ్రవాదం పెరిగిపోయిందో ఈ ఘటన చెప్తుందన్నారు. కెనడా హిందువులు ముందుకొచ్చి తమ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.