Tholi Ekadashi 2025: హిందూ సంప్రదాయం ప్రకారం ఆషాడమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. అయితే, ఈ తొలి ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో 4 నెలలు యోగ నిద్రలోకి వెళ్ళే పవిత్ర రోజు ఇది.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారంతో పాటు హిందూ దేవాలయాల నిర్మాణ అభివృద్ధికి టీటీడీ చేస్తున్న కృషిని అభినందిస్తూ ఈ లేఖ రాశారు. ధూప-దీప-నైవేద్యాలకు నోచుకోని అనేక దేవాలయాలను టీటీడీ ఆదుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు. కరీంనగర్‌లో చేపట్టిన టీటీడీ ఆలయ నిర్మాణానికి తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 2023లో కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించిందని, అదే ఏడాది…
Kartik Purnima: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలోని సరయూ నదిలోని స్నాన ఘట్టాల దగ్గర భక్తులు పూజలు, పుణ్యస్నానాల కోసం భారీగా బారులు తీరారు. కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలకు దాదాపు 10 లక్షల మందికి పైగా భక్తులు అయోధ్యకు వచ్చే ఛాన్స్ ఉందని స్థానిక అధికారులు భావిస్తున్నారు.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా దక్షిణాసియా కమ్యూనిటీల్లో మనం చూసిన హింసాత్మక ఘటన గురించి చర్చించుకోవాలన్నారు. కానీ, కెనడాలో హిందూ, సిక్కు సమాజంలో హింసను ప్రేరేపించే, విభజనను సృష్టించే వ్యక్తులకు తావు ఉండదని తెలిపారు.
ఖలిస్తానీ మద్దతుదారులు.. హిందూ సమాజానికి చెందిన సభ్యుల మధ్య వాగ్వాదం జరిగిన తరువాత పరిస్థితి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు వచ్చిన పోలీసులు హిందూ వర్గానికి చెందిన వారిని లాఠీలతో కొట్టడం కింది వీడియోలో కనిపిస్తుంది.
Canada: కెనడాలోని బ్రాంప్టన్‌లో గల ఆలయం వెలుపల హిందూ భక్తులపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేశారు. ఖలిస్థానీ మద్దతుదారుల తీరుపై ఒట్టావాలోని ఇండియన్ మిషన్ తీవ్రంగా మండిపడింది. ఈ సందర్భంగా హిందువుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది.
దేశంలో హింసాత్మక చర్యలు ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రతి కెనడియన్‌కు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉందన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి వేగంగా స్పందించినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని ట్రూడో.
జ్ఞానవాపి మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు నేటి ఉదయం సంచలన తీర్పు వెల్లడించింది. జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లోని వ్యాస్ కా తేకానాలో హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతిస్తూ ఇటీవల వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కూడా సమర్థించింది.