Khalistan Terrorist: కెనడా దేశంలో ఖలిస్థానీలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఆ దేశం నుంచి 8 లక్షల మంది హిందువులను వెనక్కి పంపించాలంటూ వేర్పాటు వాదులు టొరొంటోలోని మాల్టన్ గురుద్వారాలో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా దక్షిణాసియా కమ్యూనిటీల్లో మనం చూసిన హింసాత్మక ఘటన గురించి చర్చించుకోవాలన్నారు. కానీ, కెనడాలో హిందూ, సిక్కు సమాజంలో హింసను ప్రేరేపించే, విభజనను సృష్టించే వ్యక్తులకు తావు ఉండదని తెలిపారు.
దేశంలో హింసాత్మక చర్యలు ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రతి కెనడియన్‌కు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉందన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి వేగంగా స్పందించినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని ట్రూడో.
ప్రపంచంలోని అనేక దేశాలలో హిందూ దేవాలయాలు ఉన్నాయి. అయితే తాజాగా గురువారం కెనడాలోని టొరంటోలోని బాప్స్ స్వామి నారాయణ ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.