జైషే మహమ్మద్ అధినేత, మసూద్ అజార్ ఫ్యామిలీలోని 14 మంది ఈ దాడుల్లో చనిపోయారు. దీంతో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. భారత్ దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయాల నష్టపరిహారం అందజేస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మసూద్ అజార్‌కు నష్ట పరిహారం కింద సుమారు రూ. 14 కోట్లు దక్కే ఛాన్స్ ఉంది.
India Pakistan War:పాకిస్తాన్ వ్యాప్తంగా భారత్ దాడులు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. భారీ ఎత్తున భారత్ పాకిస్తాన్‌పై దాడులు చేస్తోంది. నార్వాల్, షార్కోట్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌లను భారత్ ద్వంసం చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రజలు సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా, పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండిపై భారీ దాడి జరిగినట్లు సమాచారం వస్తోంది.
India Pakistan:భారత్ చేతిలో భంగపడుతున్నప్పటికీ, పాకిస్తాన్ మాత్రం తన ప్రజల్ని ఫేక్ ప్రచారంతో నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ప్రతికూల విషయాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ పాక్ మీడియా కథనాలను ప్రచురిస్తోంది. పాకిస్తాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్, పాక్ మీడియా కలిసి పాక్ ప్రజల్ని బకరాలను చేస్తున్నాయి.
India Pakistan: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం పంజాబ్ ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) దాటేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ జాతీయుడిని బీఎస్ఎఫ్ కాల్చి చంపింది. భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని గురువారం బీఎస్ఎఫ్ హతమార్చింది.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. మొత్తం 09 ప్రాంతాల్లోని ఉగ్ర శిబిరాలను, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కార్యాలయాలను క్షిపణులతో భారత్ నాశనం చేసింది. ఈ నేపథ్యంలో దాయాది భారత్‌పై ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో భారత్ హై అలర్ట్ అయింది. ముఖ్యంగా, రాజస్థాన్, పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్, దాని పెంపుడు ఉగ్రవాదుల్ని భారత్ హడలెత్తించింది. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన లష్కరే తోయిబాతో పాటు జైషే మహ్మద్ ఉగ్రవాదుల్ని వెతికి వేటాడి చంపేసింది. అత్యంత ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో పాకిస్తాన్‌పై భారత్ క్షిపణి దాడులు చేసింది. ముఖ్యంగా పీఓకేతో పాటు పాక్ పంజాబ్ ప్రావిన్సుల్లోని 09 ఉగ్రస్థావరాలపై 24 దాడుల్ని చేసింది. ఈ దాడుల్లో మొత్తం 80 నుంచి 100 వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. ఉగ్రవాదానికి పాల్పడితే మీ…
Rahul Gandhi: పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పీఓకే, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో విరుచుకుపడ్డాయి. పీఓకేతో పాటు పాక్ పంజాబ్ ప్రావిన్సులోని ఉగ్ర స్థావరాలపై క్షిపణులతో భారత్ విరుచుకుపడింది. మొత్తం 09 స్థావరాలపై 24 దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సుమారుగా 80-100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రసంస్థల కార్యాలయాలు, వాటి ట్రైనింగ్ సెంటర్లని పూర్తిగా నేలమట్టం చేశారు.
Pakistan: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా జరిపిన ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’కి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పీఓకే, పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భీకర దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో దాదాపుగా 80 మంది వరకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఈ రెండు ఉగ్ర సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్న బహవల్పూర్, మురిడ్కేపై దాడులు నిర్వహించడం ఈ ఆపరేషన్‌కే హైలెట్‌గా మారింది. Read Also: Ponnam Prabhakar:…
Operation Sindoor: పహల్గామ్ దాడిలో 26 మంది అమాయకుల్ని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు బలిగొన్నారు. అప్పటి నుంచి యావత్ దేశం పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని బలంగా కోరుకుంటోంది. ప్రధాని నరేంద్రమోడీ కూడా ఉగ్రవాదులు, వారికి మద్దతుదారులు ఎక్కడా ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్, బుధవారం తెల్లవారుజాము ‘‘ఆపరేషన్ సింధూర్’’ పేరుతో పీఓకే, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నామరూపాలు లేకుండా చేసింది. ఈ దాడుల్లో సుమారుగా 80 మంది వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. భారత్ జరిపిన దాడిలో ఒక్కసారిగా పాకిస్తాన్ షాక్‌కి గురైంది. ఇదిలా ఉంటే, ఈ దాడులపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు.