Lebanon Israel War: లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో సుమారు 30 మంది ప్రాణాలు విడిచారు. బర్జా పట్టణంపై మంగళవారం రాత్రి జరిగిన దాడిలో ఓ అపార్టుమెంట్ కూలిపోయింది.
లెబనాన్‌లో ఉన్న హిజ్బుల్లాను పూర్తిగా నిర్మూలించేందుకు ఇజ్రాయెల్ నిరంతరం దాడి చేస్తోంది. మొదట సంస్థ అధిపతి సయ్యద్ హసన్ నస్రల్లా, అతని కుమార్తె, అనేక మంది టాప్ కమాండర్లు చంపబడ్డారు. అదే సమయంలో, సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఒక ఫ్లాట్‌పై జరిగిన దాడిలో నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్ ఖాసిర్ మరణించాడు. హిజ్బుల్లాకు చెందిన మీడియా కూడా దీనిని ధ్రువీకరించింది
Israeli Air Strike: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేకి భారీ ఎదురుదెబ్బ తాకింది. గతేడాది నుంచి హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతోంది. అక్టోబర్ 07 నాటి హమాస్ దాడికి ప్రధాన సూత్రధారిగా హమాస్ నేత హనియే అని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది.
Israel air strike in rafah: గాజా తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం రఫా నగరంలో పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించింది. ఆదివారం, ఇజ్రాయెల్ దళాలు రఫాలోని శరణార్థి శిబిరాలపై వైమానిక దాడులు ప్రారంభించాయి.