Gaza Truce Deal: ఇజ్రాయిల్, హమాస్ మధ్య జరుగుతున్న ‘‘గాజా యుద్ధానికి’’ బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. ఈ వారంలో ఇరు వర్గాల మధ్య యుద్ధవిరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. తొలి విడతలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న 33 మంది ఇజ్రాయిలీలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ సంధి ముగియడంతో మళ్లీ యుద్ధం ప్రారంభమైంది. ఖతార్ మధ్యవర్తిత్వంతో వారం రోజుల పాటు కొనసాగిన కాల్పుల విరమణ, బందీలు-ఖైదీల మార్పిడి నిలిచిపోయింది. సంధిని పొడగించాలని ప్రపంచదేశాలు పిలుపునిచ్చినప్పటికీ.. ఇజ్రాయిల్ పునరుద్ధరించడానికి సిద్ధంగా లేదు. దీంతో గాజాపై ఇజ్రాయిల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. గాజా స్ట్రిప్‌పై శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 240 మంది మరణించినట్లు హమాస్ తెలిపింది.
Israel-Hamas: ఇజ్రాయిల్-హమాస్ మధ్య 50 రోజలు యుద్ధం తర్వాత ప్రస్తుత కాల్పుల విరమణ కొనసాగుతుంది. ఇరు పక్షాల కూడా బందీలను, ఖైదీలను మార్చుకుంటున్నాయి. తాజాగా గురువారం ఉదయంతో సంధి ముగిసేందుకు కొన్ని నిమిషాల ముందు.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడగిస్తున్నట్లు, సంధి కాలాన్ని పెంచినట్లు ఇరు పక్షాలు ప్రకటించాయి. ఖతార్ వేదికగా ఈ ప్రకటన వెలువడింది. ఇజ్రాయిల్ సైన్యం సంధిని పొడగిస్తు్న్నట్లు తెలిపింది.
Israel-Hamas: ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ఒప్పందాన్ని మరో 4 రోజులు పొడగించేందుకు హమాస్ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయిల్ నుంచి పాలస్తీనా ఖైదీలను, హమాస్ నుంచి ఇజ్రాయిలీ బందీలను విడుదల చేయడానికి మార్గం సుగమమైంది. సంధి పొడగింపుపై మధ్యవర్తులు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు వారాల యుద్ధం తర్వాత గత శుక్రవారం నుంచి సంధి అమలులోకి వచ్చింది. ప్రస్తుతం సంధి గురువారంతో ముగుస్తుంది. ఈనేపథ్యంలోనే మరింత కాలం సంధిని పొడగించాలని హమాస్, ఇజ్రాయిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఖతార్, ఈజిప్టు దేశాల మధ్యవర్తిత్వంతో ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి కుదిరింది. నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయిల్ అంగీకరించింది. దీంట్లో భాగంగా హమాస్ తన వద్ద ఉన్న బందీలను విడుదల చేస్తోంది, మరోవైపు ఇజ్రాయిల్ పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని డీల్ కుదిరింది.
Israel-Hamas war: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత రెండు నెలలుగా బందీలుగా ఉన్నవారిలో 25 మందిని హమాస్ ఉగ్రవాదులు విడుదల చేశారు. విడుదలైన వారిలో 12 మంది థాయ్‌లాండ్ దేశస్తులు ఉన్నట్లు ఆ దేశ ప్రధాని స్ట్రెట్టా థావిసిస్ పేర్కొన్నారు. నాలుగు రోజలు కాల్పుల విరమణలో భాగంగా హమాస్, ఇజ్రాయిల్ సంధి ఒప్పందానికి వచ్చాయి. మరోవైపు జైళ్లలో ఉన్న 39 మంది పాలస్తీనియన్ ఖైదీలను ఇజ్రాయిల్ విడుదల చేయనుంది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయిల్ ఆర్మీ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర గాజాపై హమాస్ ఉగ్రవాదులు నియంత్రణ కోల్పోయారని గాజా ప్రజలను ఉద్దేశించి ఇజ్రాయిల్ ఆర్మీ తెలిపింది. ఇజ్రాయిల్-హమాస్ సంధి నేపథ్యంలో నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. అయితే ఈ ఒప్పందంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ దళాలు తాజా హెచ్చరికలు చేశాయి.