Iran War: అమెరికా పైలట్ రెస్క్యూ అంతా వట్టిదేనా.. “యురేనియం” దొంగిలించడానికి ఇదంతా చేసిందా?
- ఇరాన్లో పైలట్ రెస్క్యూ ఆపరేషన్ వట్టిదేనా..?
- యురేనియం దొంగిలించే ప్రయత్నమని ఇరాన్ ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: అమెరికా తన పైలట్ కోసం ఇరాన్లో భారీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్లు చెబుతోంది. ఈ రెస్క్యూ కోసం యూఎస్ భారీ సంఖ్యలో యుద్ధ సామాగ్రిని మోహరించింది. అయితే, ఇరాన్ మాత్రం ఇందుకు వేరే కారణం ఉందని చెబుతోంది. పైలట్ రెస్క్యూ కేవలం సాకు మాత్రమే అని, దీనికి వెనక ‘‘యురేనియం’’ దొంగిలించే ప్లాన్ ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ మొత్తం ఆపరేషన్ విజయాన్ని తక్కువగా చేసేందుకు ఇరాన్ ప్రయత్నించింది.
Read Also: Donald Trump: మనలోనే ‘‘గూఢచారి’’ ఉన్నాడు.. మీడియాకు ట్రంప్ వార్నింగ్..
Also Read
ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ మాట్లాడుతూ.. ఇది నిజమైన రెస్క్యూ ఆపరేషన్ కాకపోవచ్చని, ఇది ‘‘ఎన్ రిచ్డ్ యురేనియం’’ దొంగిలించడానికి ఒక మోసపూరిత ఆపరేషన్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈ మిషన్ చుట్టూ చాలా ప్రశ్నలు, అనిశ్చితులు ఉన్నాయని అన్నారు. అమెరికన్ పైలట్ కోహ్గిలుయే, బోయిర్ అహ్మద్ ప్రావిన్స్‌లో చిక్కుకుపోయినట్లు చెబుతున్నారు, కానీ అమెరికన్ బలగాలు సెంట్రల్ ఇరాన్లో దిగేందుకు ప్రయత్నించారని, పైలట్ ఉన్న ప్రాంతానికి చాలా దూరంలో దిగాలని ప్రయత్నించినట్లు ఆయన ఆరోపించారు.
ప్రస్తుతం ఇరాన్ వద్ద 400 నుంచి 450 కిలోల ఎన్రిచ్డ్ యురేనియం ఉన్నట్లు భావిస్తున్నారు.ఈ పరిమాణం అణ్వాయుధాలు తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. ఇరాన్లో యురేనియాన్ని స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ భూతల దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు గతంలో అమెరికన్ మీడియా వెల్లడించింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ ప్రకారం.. ఈ యురేనియం నటాంజ్, ఇస్ఫహాన్‌లోని అణు సముదాయాల్లో ఉండొచ్చని అంచనా వేశారు.
తాజావార్తలు
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!