Donald Trump: మనలోనే ‘‘గూఢచారి’’ ఉన్నాడు.. మీడియాకు ట్రంప్ వార్నింగ్..
- మనలోనే గూఢచారి ఉన్నారు..
- మీడియాపై ట్రంప్ ఆగ్రహం..
- పైలట్ రెస్య్కూ ఆపరేషన్ లీక్ కావడంపై ఫైర్..
- సోర్స్ చెప్పకపోతే జైలుకు వెళ్తారంటూ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధం గురించి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో అమెరికన్ పైలట్ రెస్క్యూ ఆపరేషన్ గురించి రహస్య సమాచారం లీక్ కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీక్ వెనక అమెరికా ప్రభుత్వంలోనే గూఢచారి ఉన్నారని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!
Also Read
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
ట్రంప్ మాట్లాడుతూ.. ఈ లీక్ కారణంగా మొత్తం రెస్క్యూ ఆపరేషన్ ప్రమాదంలో పడిందని, ఇరాన్‌లో ఒక అమెరికన్ సైనికుడు చిక్కుకుపోయాడన్న విషయం బయటపడటం వల్ల పరిస్థితి క్లిష్టతరంగా మారిందని ట్రంప్ అన్నారు. ఈ సమాచారం ముందుగా ఇరాన్‌కు తెలియదని, ఈ లీక్ వల్ల శత్రువులకు లాభం చేకూరిందని అన్నారు. ఈ వార్తను ముందుగా బయటపెట్టిన మీడియా సంస్థపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో వెల్లడించకపోతే, సంబంధిత జర్నలిస్ట్ జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు సదరు జర్నలిస్ట్, మీడియా సంస్థ పేరు వెల్లడించలేదు. మొదటి పైలట్‌ను రక్షించిన తర్వాత, రెండో సైనికుడు కూడా ఉన్నాడనే విషయం ఈ లీక్ ద్వారా ఇరాన్‌కు తెలిసిందని ఆయన అన్నారు. ఈ వార్తను ముందుగా న్యూయార్క్ టైమ్స్, ఫాక్స్ న్యూస్, యాక్సియోస్ నివేదించాయి. పైలట్‌ను రక్షించడానికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీ ఆపరేషన్ చేపట్టినట్లు ట్రంప్ తెలిపారు. రెస్క్యూ కోసం 155 విమనాలు, నాలుగు బాంబర్లు, 64 ఫైటర్లు, 48 ఇంధనాన్ని నింపే ట్యాంకర్లు, 13 రెస్క్యూ విమనాలు పాల్గొన్నట్లు ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!