Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
- మరో సంక్షోభానికి తెర
- హౌతీల ద్వారా ఇరాన్ ప్లాన్
- అంతర్జాతీయ మీడియాలో కథనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ ఇప్పటి వరకు హార్ముజ్‌ను అడ్డంపెట్టుకుని ప్రపంచ దేశాలను ఆటాడుకుంటోంది. అమెరికా జరుపుతున్న తాజా దాడులతో టెహ్రాన్ మరో అస్త్రాన్ని బయటకు తీయబోతున్నట్లుగా తెలుస్తోంది. హార్ముజ్ దిగ్భంధంతో ఇప్పటికే చమురు, గ్యాస్ కష్టాలతో దేశాలు అల్లాడుతుండగా.. ఇప్పుడు ప్రపంచం షేక్ అయ్యేలా మరో సంక్షోభానికి తెరదించబోతున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Also Read
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్న వేళ.. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన మరో సముద్ర మార్గం బాబ్ ఎల్-మండెబ్ జలసంధి (Bab el-Mandeb Strait)పై కూడా ముప్పు పొంచి ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్.. అమెరికా, దాని మిత్రదేశాలకు ప్రయోజనం చేకూర్చే ఇతర ఎగుమతి మార్గాలను కూడా లక్ష్యంగా చేసుకోవచ్చని హెచ్చరించింది.

బాబ్ ఎల్-మండెబ్ జలసంధి ఎర్ర సముద్రాన్ని ఏడెన్ గల్ఫ్‌తో అనుసంధానిస్తూ సూయజ్ కాలువకు దక్షిణ ద్వారంగా పనిచేస్తుంది. ప్రపంచ కంటైనర్ రవాణాలో గణనీయమైన భాగం ఇక్కడ నుంచే జరుగుతుంది. అంతేకాకుండా సౌదీ అరేబియా నుంచి యూరప్‌కు వెళ్లే చమురు ఎగుమతులు ఈ మార్గం గుండానే సాగుతాయి. ఈ జలసంధిలో రవాణా అంతరాయం ఏర్పడితే నౌకలు ఆఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ సుదీర్ఘ మార్గంలో ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో రవాణా వ్యయం, బీమా ఖర్చులు, సరుకు చేరే సమయం భారీగా పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు.. ఈ మార్గంలోనే ప్రపంచానికి సరఫరా అయ్యే ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయి. ఒకవేళ అమెరికా దాడులు తీవ్రం చేస్తే హౌతీయుల ద్వారా ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేసే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అదే జరిగితే మాత్రం ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. భారత్ కూడా భారీగా నష్టపోతుంది.

ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ ప్రకారం.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) హార్ముజ్ జలసంధి తర్వాత అమెరికా, దాని మిత్రదేశాలకు ప్రయోజనం చేకూర్చే ఇతర ఎగుమతి మార్గాలను కూడా లక్ష్యంగా చేసుకోవచ్చని హెచ్చరించింది. ప్రాంతీయ ఇంధన ఎగుమతులు అందరికీ అందుబాటులో ఉండాలి.. లేకపోతే ఎవరికీ అందకూడదని ఐఆర్జీసీ పేర్కొంది. ఈ ప్రకటనలో ప్రత్యేకంగా బాబ్ ఎల్-మండెబ్ పేరు ప్రస్తావించకపోయినా.. యెమెన్‌లోని హౌతి తిరుగుబాటుదారుల ద్వారా ఆ మార్గంపై దాడులు చేయించే అవకాశాన్ని ఇరాన్ పరిశీలిస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇరాన్‌కు చెందిన ప్రెస్ టీవీ కథనం ప్రకారం.. సౌదీ అరేబియా యెమెన్‌పై దాడులు కొనసాగిస్తే బాబ్ ఎల్-మండెబ్ జలసంధిని మూసివేయడానికి సిద్ధంగా ఉన్నామని హౌతి తిరుగుబాటు సంస్థకు చెందిన ఓ సీనియర్ నేత హెచ్చరించారు. అలా జరిగితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 200 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇటీవల హౌతీలు సౌదీ అరేబియాపై క్షిపణి దాడులు జరిపిన తర్వాత ఈ హెచ్చరిక రావడం గమనార్హం. దీంతో నాలుగేళ్లుగా కొనసాగుతున్న సౌదీ-హౌతి కాల్పుల విరమణ కూడా ముగిసినట్లు తెలుస్తోంది.
2023 అక్టోబర్‌లో గాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత హౌతి తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై పలుమార్లు దాడులు చేశారు. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్న దేశాలకు చెందిన నౌకలనే లక్ష్యంగా చేసుకున్నామని అప్పట్లో ప్రకటించారు. ఈ దాడుల కారణంగా అనేక అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు తమ నౌకలను దక్షిణ ఆఫ్రికా మార్గంలో మళ్లించాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి.
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం.. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు చేసే ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపర్చేందుకు అమెరికా తాజాగా మరో విడత వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన క్షిపణి స్థావరాలు, డ్రోన్ కేంద్రాలు, తీర రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా వెల్లడించింది. గత వారం రోజుల్లో ఇరాన్ వాణిజ్య నౌకలపై ఏడు దాడులు చేయగా.. పలువురు సిబ్బంది మృతి చెందడం, అదృశ్యమయ్యారు. మరోవైపు ఇరాన్ మాత్రం అమెరికా దాడుల్లో బంపూర్ సైనిక స్థావరంలో ఏడుగురు సైనికులు మృతి చెందారని, దక్షిణ ఇరాన్లో కనీసం 30 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది.
పెద్ద ముప్పా?
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. హార్ముజ్, బాబ్ ఎల్-మండెబ్ జలసంధులు రెండూ ఒకేసారి ప్రభావితమైతే ప్రపంచ చమురు, వాణిజ్య సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. హార్ముజ్ గల్ఫ్ దేశాల చమురు ఎగుమతులకు ప్రధాన ద్వారం కాగా.. బాబ్ ఎల్-మండెబ్ ఎర్ర సముద్రం, సూయజ్ కాలువను హిందూ మహాసముద్రంతో అనుసంధానించే అత్యంత కీలక మార్గం. ఈ రెండు సముద్ర మార్గాల్లో దీర్ఘకాల అంతరాయం ఏర్పడితే ప్రపంచ సరఫరా గొలుసులు దెబ్బతినడం, రవాణా వ్యయాలు పెరగడం, ఇంధన ధరలు భారీగా ఎగబాకడం వంటి పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- Tags
- Bab el-Mandeb Strait
- Iran
- us
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!