Nick Jonas: హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్‌తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nick Jonas: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ జంట ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 2018లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట ప్రేమకథ గురించి ఇప్పటికే ఎన్నో కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ, తాజాగా ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ప్రియాంకతో తన ప్రేమకథ ఎలా మొదలైందో, ఆమెకు పంపిన తొలి మెసేజ్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తాజాగా నిక్ వెల్లడించారు.
జోనస్ బ్రదర్స్ యూట్యూబ్ పోడ్కాస్ట్లో ప్రియాంక చోప్రా అతిథిగా పాల్గొనగా, ఆ సందర్భంగా నిక్ తమ పరిచయం గురించి మాట్లాడారు. ప్రియాంకకు తాను మొదటిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పంపడానికి తన సోదరుడు కెవిన్ జోనస్ ప్రధాన కారణమని చెప్పారు. కెవిన్ సూచనతోనే ప్రియాంక నటించిన అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’ చూడటం స్టార్ట్ చేశానని ఆయన వెల్లడించారు. సిరీస్ చూసిన కొద్ది రోజులకే ఓ భారీ బిల్‌బోర్డ్‌పై ‘క్వాంటికో’ ప్రచారంలో ప్రియాంక ఫొటో కనిపించిందని, అది తనకు ఒక ప్రత్యేక సిగ్నల్‌గా అనిపించిందని నిక్ తెలిపారు. వెంటనే అప్పటి ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్) ద్వారా ఆమెకు డైరెక్ట్ మెసేజ్ పంపినట్లు చెప్పారు. ఆ మెసేజ్‌కు స్పందించిన ప్రియాంక, తన ఫోన్ నంబర్ ఇచ్చి టెక్స్ట్ చేయాలని చెప్పడంతో అలా తమ ఇద్దరి మధ్య మాటలు మొదలైనట్లు వెల్లడించారు. అనంతరం 2017లో న్యూయార్క్‌లోని కార్లైల్ హోటల్లో ఇద్దరం ఫస్ట్ టైం కలుసుకున్నామని గుర్తు చేసుకున్నారు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
అదే ఏడాది మెట్ గాలా ఈవెంట్లో కలిసి కనిపించడంతో ఈ ఇద్దరు డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అప్పట్లో తాము కేవలం స్నేహితులమేనని ఇద్దరూ చెప్పినా, తర్వాత వారి స్నేహం ప్రేమగా మారింది. 2018 జూలైలో గ్రీస్‌లో నిక్ జోనస్ ప్రియాంకకు ప్రపోజ్ చేయగా, అదే ఏడాది డిసెంబర్లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం ఘనంగా వివాహం చేసుకున్నారు. తాజాగా నిక్ చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ప్రియాంక చోప్రా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన వారణాసి చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!