Iran Warning: భూతల దాడులు చేస్తే… అమెరికాకు అదే గతి.. ఇరాన్ పత్రిక వార్నింగ్
- మరింత తీవ్ర రూపం దాల్చిన పశ్చిమాసియా యుద్ధం
- ‘తగ్గేదేలే’ అంటూ దూకుడు పెంచిన ఇరాన్
- ఇరాన్ పత్రిక వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన నెల రోజుల తర్వాత మరింత తీవ్ర రూపం దాల్చింది. ‘తగ్గేదేలే’ అంటూ దూకుడు పెంచింది. గల్ఫ్ దేశాలు, అమెరికా స్థావరాలపై భీకర దాడులు చేస్తోంది. ఇక అమెరికా కూడా భూతల దాడులు చేసేందుకు సిద్ధపడుతోంది. అమెరికా సైన్యం రంగంలోకి దిగుతోంది. ఇలాంటి తరుణంలో ఇరాన్ పత్రిక అమెరికాకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ‘‘నరకానికి స్వాగతం’’ అంటూ టైటిల్ పెట్టింది. ఇరాన్‌పైకి భూతల దళాలు ప్రవేశిస్తే.. అమెరికా సైనికులు ‘శవపేటికల్లోనే తిరిగి వెళ్తారని’ హెచ్చరించింది.
‘‘వెల్కమ్ టు హెల్’’ అనే హెడ్‌లైన్‌తో ప్రచురించిన కథనంలో ఇరాన్ భూభాగంలోకి అడుగుపెట్టే అమెరికా సైనికులు “శవపేటికల్లోనే తిరిగి వెళ్తారు” అని ఘాటుగా వ్యాఖ్యానించింది. అమెరికా మరో 10,000 వరకు భూసేనలను మధ్యప్రాచ్యానికి పంపే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెలువడిన నేపథ్యంలో ఈ హెచ్చరిక రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది ఇరాన్‌పై భూస్థాయి యుద్ధానికి దారితీయవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ (The Wall Street Journal) నివేదిక ప్రకారం… అదనపు అమెరికా సైనికులను ఇరాన్‌కు సమీప ప్రాంతాల్లో మోహరించే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్‌కు చెందిన కీలక చమురు ఎగుమతి కేంద్రం అయిన ఖార్గ్ దీవి పరిసరాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశముందని అంచనా వేసింది.
Also Read
- Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రత
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
- Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్‌పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం
గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులతో చేలరేగిపోయింది. గల్ఫ్ దేశాలు లక్ష్యంగా దాడులు చేస్తోంది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Trump: ‘నా కాళ్లకు నమస్కరిస్తాడని అనుకోలేదు’.. సౌదీ యువరాజుపై బాంబ్ పేల్చిన ట్రంప్
తాజావార్తలు
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
Small Budjet Movies : చిన్న బడ్జెట్ సినిమాలకు రొమాన్స్, బోల్డ్, ఇంటిమేట్ సీన్స్నే సేఫ్ ఫార్ములాగా భావిస్తున్నారా?
-
Horror Spell: టీమిండియా స్టార్ పేసర్‌ను పొట్టుపొట్టు కొట్టిన లోకల్ ప్లేయర్స్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే!
-
AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
-
Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
ట్రెండింగ్
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!