UP: ఇద్దరు భార్యలతో 18 మంది సంతానం.. చివరికి ప్రియురాలి చేతిలో..!
- ఉత్తరప్రదేశ్‌లో దారుణం
- ఇద్దరు భార్యలతో 18 మంది సంతానం
- మరో వివాహితతో మాజీ సర్పంచ్ అక్రమ సంబంధం
- హత్య కేసును ఛేదించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘‘ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు’’గా ఉందంటారు కొందరు వ్యక్తులను చూసి. కరెక్ట్‌గా అలాంటి వ్యవహారమే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గ్రామానికే పెద్దగా చెలామణి అయి.. దర్జాగా బ్రతికిన ఓ పెద్ద వ్యక్తి చివరికి ప్రియురాలి చేతిలో కుక్క చావు చచ్చాడు. ఇప్పుడు ఈ వ్యవహారం పెద్ద చర్చగా మారింది.

Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ముస్తకా గుల్షన్ అలియాస్ మున్నా.. ఉత్తరప్రదేశ్‌లోని సుమేర్‌పూర్ గ్రామ మాజీ సర్పంచ్. ఇతడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కిస్మతుల్ నిషాకు తొమ్మిది మంది పిల్లలు ఉండగా.. రెండో భార్య అంబియా బానోకు కూడా తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. మొత్తంగా 18 మంది పిల్లలున్నారు. అయితే గ్రామ సర్పంచ్‌గా పని చేసిన మున్నా బుద్ధి మాత్రం మంచిగా లేదు. ఇద్దరు భార్యలుండి.. 18 మంది పిల్లలుండి కూడా వంకర బుద్ధి చూపించాడు.
గ్రామంలో ఉన్న సుమన్ దేవి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సుమన్ దేవి భర్త ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. ఇదే అదునుగా ఆమెకు సాయం పేరుతో దగ్గరయ్యాడు. పదే పదే కలవాలంటూ ఒత్తిడి తేవడం.. అక్కడితో ఆగకుండా బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. ఈ వ్యవహారం భర్తకు తెలిస్తే ఏమవుతుందోనన్న భయంతో తన సోదరుడితో కలిసి మున్నా హత్యకు ప్రణాళిక రచించింది. ప్లాన్‌లో భాగంగా మార్చి 18న తన పుట్టింటికి సుమన్ దేవి ఆహ్వానించింది. దీంతో మున్నా గదిలోకి రాగానే సోదరుడు, అతడి అనుచరులు కలిసి రాడ్లు, కర్రలతో కొట్టి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని సంచిలో కుక్కి కాలువలో పడేశారు.
అయితే మున్నా కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలో దిగారు. మున్నా మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడి బైక్ వేరే చోట గుర్తించారు. అలాగే ఫోన్ కాల్స్ రికార్డ్స్ ప్రకారం నిందితురాలను గుర్తించారు. విచారించగా తన సోదరుడితో కలిసి హత్య చేసినట్లుగా సుమన్ దేవి ఒప్పుకుంది. అనంతరం మార్చి 22 (ఆదివారం)న కాలువ దగ్గర మున్నా మృతదేహాన్ని గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.
మున్నాకు ఇద్దరు భార్యలు, 18 మంది సంతానం ఉన్నారని.. ఒక కుమార్తెకు వివాహం కూడా జరిపించాడని పోలీసులు తెలిపారు. మరోసారి గ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేయాలని సిద్ధపడుతున్నాడని.. ఈ క్రమంలో సుమన్ దేవితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. పదే పదే బెదిరించడంతో ప్రియురాలు చంపేసిందని వెల్లడించారు. అయితే మున్నా చనిపోవడంతో ఇద్దరు భార్యలు, పిల్లలు తీవ్ర విషాదంతో కన్నీరు మున్నీరయ్యారు.
ఇది కూడా చదవండి: PM Modi: చమురు, గ్యాస్‌పై ఆందోళన అక్కర్లేదు.. భారతీయులంతా సురక్షితమేనన్న మోడీ
తాజావార్తలు
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..