Iran Nuclear Tests: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను ఇరాన్ మరింత పెంచుతుంది. అందులో భాగంగా తాజాగా అణు పరీక్షలు చేసినట్లు సమాచారం. అక్టోబర్ 5వ తేదీన శనివారం రాత్రి ఇరాన్, ఇజ్రాయెల్ భూభాగాల్లో దాదాపుగా ఒకే టైంలో సంభవించిన భూకంపం ఈ అనుమానాలకు దారి తీసింది.
Nawaz Sharif: నాలుగేళ్ల ప్రవాసం తర్వాత పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వదేశానికి తిరిగివచ్చారు. దుబాయ్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఇస్లామాబాద్ చేరుకున్నారు. అక్కడ నుంచి తన కంచుకోట అయిన పంజాబ్ ప్రావిన్సులోని లాహోర్‌కి భారీ ర్యాలీ నడుమ వచ్చారు. దేశాన్ని, దేశ ప్రజలను ఉద్దేశించి ర్యాలీలో ప్రసంగించారు. తాను ప్రధానిగా ఉన్న సమయంలో సాధించిన విజయాల గురించి ఆయన ప్రజలకు వివరించారు.
ఎప్పుడూ యుద్ధం గురించి వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి అమెరికాతో కయ్యానికి కాలు దువ్వే విధంగా ఆయన మాట్లాడారు. కిమ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే ఉత్తర కొరియా మరోసారి ప్రపంచానికి సవాల్ విసరనుందన్న భావన కలుగుతోంది. తమకు అమెరికా, దక్షిణ కొరియా దేశాల నుంచి ముప్పు ఉందని, తాము ఆత్మరక్షణ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కిమ్ అన్నారు.