ఒకే వ్యక్తికి 88 పెళ్లిళ్లు జరిగాయంటే ఎవరైనా షాక్ అవుతారు.. కానీ, ఇది నిజం.. 14వ సంవత్సరంలోనే తొలి మ్యారేజ్ చేసుకున్న ఓ వ్యక్తి ఇప్పుడు.. 61వ ఏట ఏకంగా 88వ పెళ్లికి సిద్ధమై ఔరా! అనిపించాడు.. ఇండోనేషియాలో జరిగిన ఈ నిత్య పెళ్లి కొడుకుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వెస్ట్ జావాలోని మజలెంగ్కాకు చెందిన 61 ఏళ్ల ఖాన్ అనే వ్యక్తికి ఇప్పటికే 87 పెళ్లిలు జరిగాయి.. అయినా మనోడి యావ చావలేదు.. చింత చచ్చినా పులుపు చావదు అన్నట్టుగా… ఈ సమయంలోనే మరో పెళ్లికి సిద్ధం అయ్యాడు.. ముచ్చటగా 88వ పెళ్లికి రెడీ అయిపోయాడు.. అయితే, ఈసారి తన మాజీ భార్యనే మళ్లీ వివాహం ఆడబోతున్నారు.. అదేంటి? మాజీ భార్యను మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటి అనుకోకండి.. ఆమె ఖాన్ నుంచి విడిపోయినా.. అతనినే ప్రేమిస్తుందట.. అందుకే మళ్లీ పెళ్లి.. మరో ట్విస్ట్ ఏంటంటే.. వరుసగా 88వ పెళ్లిళ్లు చేసుకున్నవాడికి.. ఎన్ని ఆస్తులు పాస్తులు ఉన్నాయో.. అందుకే ఇన్ని పెళ్లిళ్లు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే.. ఆయన ఓ సామాన్య రైతు. ఈ నిత్య పెళ్లి కొడుకుకు “ప్లేబాయ్ కింగ్” అనే పేరు కూడా వచ్చిందట.
Read Also: CM YS Jagan: నా ఒక్కడి వలన జరిగేది కాదు.. మీరు నేను ఒక్కటైనప్పుడే సాధ్యం..
అయితే, ఒకే వ్యక్తికి ఇన్ని పెళ్లిళ్లు ఎలా జరిగాయనే విషయానికి వస్తే.. ఖాన్ తన 14వ ఏట పెళ్లిళ్ల దండ యాత్ర మొదలుపెట్టాడట.. అతని మొట్టమొదటి భార్య అతని కంటే రెండేళ్ల పెద్దది. అయితే తన పేదరికం కారణంగా పెళ్లైన రెండేళ్లకే విడాకులు ఇచ్చేసిందట.. ఇదే ఖాన్‌కు కోపం వచ్చిందంట.. భార్య తనను వదిలి వెళ్లిపోవడంతో.. ఎంతో మానసిక వేదనకు గురయ్యాడట.. అప్పటి నుంచి తనలోని ప్రేమికుడ్ని నిద్రలేపాడట.. మహిళలు తనతో ప్రేమలో పడేలా చేసుకోవాలని నిర్ణయానికి వచ్చి.. మహిళలను ప్రేమించడం మొదలుపెట్టాడు. అందులో కొందరిని పెళ్లి చేసుకున్నాడు. అయితే, తాను ఏ మహిళను ఇబ్బంది పెట్టలేదంటున్నాడు… వారి భావోద్వేగాలతో ఆడుకోనని.. అందుకే తనతో చాలామంది మహిళలు ప్రేమలో పడిపోయారని చెప్పుకొచ్చాడు ఖాన్.. మొత్తంగా.. 61వ ఏట.. 88వ పెళ్లి.. అదు కూడా.. తన మాజీ భార్యనే మళ్లీ పెళ్లి చేసుకుంటూ.. వైరల్‌గా మారిపోయాడు “ప్లేబాయ్ కింగ్” .