సాధారణంగా ఎవరైనా ఒక అమ్మాయి కోసం అబ్బాయిలు కొట్టుకోవడం చూస్తుంటాం. కానీ ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయి కొట్టుకోవడం ఎప్పుడైనా చూసుంటారా.. చూసే ఉంటారు.. అది ఎక్కడో ఒక చోట కామన్ గా జరుగుతుంది. ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్న సంఘటన ఒంగోలు జిల్లాలో జరిగింది. ఒక యువకుడిపై మనసు పడిన ఇద్దరు మహిళలు.. అతడి కోసం గొడవలు పడ్డారు. దీనికి సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతుంది.
Read Also: Job at Google: అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. ఏకంగా 2.25 కోట్ల ప్యాకేజీతో కొలువు..!
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒంగోలులో కేటరింగ్ పనులు చేసుకుంటున్న ఇద్దరు మహిళలు మంచి స్నేహితులు. ఈ ఇద్దరూ తమతో సన్నిహితంగా ఉంటున్న ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా.. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ యువకుడు ఓ మహిళకు దూరమయ్యాడు. దీంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Wife Attacked Husband: ఏందమ్మా ఇది.. భర్త ఇళ్లు క్లీన్ చేయలేదని.. ఆ ఇళ్లాలు ఏం చేసిందో తెలుసా…
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలులోని చంద్రయ్య నగర్‌లో నివాసం ఉంటున్న స్నేహితులైన ఇద్దరు మహిళలలు.. కేటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరూ అక్కడే పనిచేస్తున్న ఓ యువకుడిపై మోజుపడి అతడితో విడివిడిగా సహజీవనం చేస్తున్నారు ఇద్దరు మహిళలు. అయితే గత కొన్ని రోజులుగా ఈ లైంగిక సంబంధాల కారణంగా ఇద్దరు మహిళల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 25న ఆరుగురు వ్యక్తులు వచ్చిన సీనియర్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లి మిర్యాలపాలెం సెంటర్ దగ్గర ఒక ఇంట్లో బంధించారు. ఆ తర్వాత ఆమెను చిత్రహింసలు పెట్టి.. ఆమె బట్టలు ఊడదీసి దాడికి పాల్పడ్డారు. ఆపై గందరగోళం సృష్టించారు. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారు. అయితే ఎలాగోలా తన స్నేహితురాలి సాయంతో అక్కడి నుంచి తప్పించుకున్న సీనియర్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.