ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఈ యుద్ధంలోకి అమెరికా కూడా ప్రవేశించింది. దీంతో ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. అలాగే ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు చేస్తోంది. దీంతో ఇరు దేశాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో భారత్‌కు చెందిన ఒక ఇంజనీర్ ఇరాన్‌లో అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు. తమకు సాయం చేయాలంటూ భారత ప్రభుత్వాన్ని బాధిత కుటుంబం వేడుకుంది.
ఇది కూడా చదవండి: Maharashtra: అమానుషం.. నీట్ మాక్ టెస్ట్‌లో ఫెయిలైందని కర్రతో దాడి.. కుమార్తె మృతి
బీహార్‌కు చెందిన 25 ఏళ్ల సిరాజ్ అలీ అన్సారీ.. ఓ ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అతడితో పాటు మరికొంత మంది ఇరాన్‌లో ఒక ప్లాంట్ నిర్మాణం కోసం పని చేస్తున్నారు. జూన్ 9న సౌదీ అరేబియా మీదుగా సిరాజ్ ఇరాన్ చేరుకున్నాడు. ఇంతలోనే ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అయితే సిరాజ్ పని చేస్తున్న ప్రాంతంలో క్షిపణి దాడులు జరిగాయి. అక్కడ వారిని వేరే ప్రాంతాలకు తరలించారు. జూన్ 17న సిరాజ్‌తో కుటుంబ సభ్యులు చివరి సారిగా ఫోన్‌లో మాట్లాడారు. అప్పటి నుంచి సిరాజ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై ఇరాన్‌లో భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. తమ బిడ్డ ఆచూకీ గుర్తించాలని వేడుకున్నారు.
ఇది కూడా చదవండి: TTD: తిరుమలలో నగదు రహిత లావాదేవీలు.. టీటీడీ మరో ముందడుగు..
ఇదిలా ఉంటే ఇప్పటికే ఇరాన్ నుంచి భారతీయులను కేంద్ర ప్రభుత్వం తరలిస్తోంది. ఇప్పటికే విద్యార్థులను ఢిల్లీకి తీసుకొచ్చారు. ఇక సొంత రవాణా సౌకర్యాలు కలిగిన వారు కూడా భారత్‌కు వచ్చేయాలని తెలిపింది. ఇంతలోనే సిరాజ్ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు భారత ఎంబసీ ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.