Maharashtra: అమానుషం.. నీట్ మాక్ టెస్ట్‌లో ఫెయిలైందని కర్రతో దాడి.. కుమార్తె మృతి
- మహారాష్ట్రలో అమానుషం
- నీట్ మాక్ టెస్ట్‌లో ఫెయిలైందని కర్రతో తండ్రి దాడి
- పట్టించుకోకపోవడంతో కుమార్తె మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. నీట్ మాక్ టెస్ట్‌లో కుమార్తెకు తక్కువ మార్కులు వచ్చాయని ఓ తండ్రి ఘాతుకానికి తెగబడ్డాడు. విచక్షణ మరిచి చెక్క కర్రతో చితకబాదాడు. అనంతరం పట్టించుకోకపోవడంతో కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. డాక్టర్ కావల్సిన కుమార్తె.. శవమైంది. ఈ విషాద ఘటన సాంగ్లి జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Tejeshwar Murder Case: తేజేశ్వర్ హత్య కేసు.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు.. హత్యకు కారణం అదే!
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ధోండిరామ్ భోసలే అనే వ్యక్తి మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. అతడి కుమార్తె(17) 12వ తరగతి చదువుతోంది. ఇంకోవైపు నీట్ కోచింగ్ తీసుకుంటోంది. అయితే కుమార్తెకు నీట్ మాక్ టెస్ట్‌లో తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. కోపంలో కుమార్తెను చెక్క కర్రతో నిర్దాక్షిణ్యంగా చితకబాదాడు. అనంతరం కుమార్తెను పట్టించుకోకుండా పాఠశాలలో జరుగుతున్న యోగా దినోత్సవ వేడుకలకు వెళ్లిపోయాడు. తిరిగి వచ్చేసరికి కుమార్తె ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని చూసి ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. బాలిక మృతికి కారణమైన తండ్రి, ప్రిన్సిపాల్ ధోండిరామ్ భోసలేను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
ఇది కూడా చదవండి: 8 Vasanthalu : బ్రాహ్మిణ్ పాత్రతో కాశీ ‘కబేళా’లో రేప్ చేయిస్తారా?
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!