Round The World Cruise: ప్రయాణికుడ్ని వదిలి క్రూజ్ షిప్ జంప్.. 17 లక్షలు స్వాహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Spent 17 Lakh On Round-The-World Cruise It Left Without Him: పాపం ఆ వ్యక్తి.. ప్రపంచాన్ని చుట్టేద్దామని రూ.17 లక్షలకు పైగా ఖర్చు వెచ్చించాడు. తనకోసం క్రూజ్ షిప్‌లో ఒక బెర్త్ సొంతం చేసుకున్నాడు. కానీ.. మార్గమధ్యంలో జరిగిన కొన్ని పరిణామాల కారణంగా, ఆ షిప్ అతడ్ని వదిలేసి వెళ్లిపోయింది. తన మెడికల్ చెకప్స్ చేయించుకొని ఆ వ్యక్తి తిరిగొచ్చేలోపే.. ఆ షిప్ జంప్ అయిపోయింది. దీంతో చేసేదేమీ లేక.. సదరు వ్యక్తి తిరిగి తన ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. యూకేకి చెందిన క్రిస్టోఫర్ ఛాపెల్ (72 ఏళ్లు) తన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించేశాడు. చివరగా అతనికి మిగిలింది ఒకే ఒక్క కల.. అదే ప్రపంచాన్ని చుట్టేయడం. ఒక క్రూజ్ షిప్ యూకే నుంచి వరల్డ్ టూర్‌కి బయలుదేరుతోందన్న విషయం తెలిసి, ఆ షిప్‌లో 17500 పౌండ్స్ (రూ.17.83 లక్షలు) వెచ్చించి, తన కోసం బెర్తు బుక్ చేసుకున్నాడు.
EasyJet Flight: అత్యవసర ల్యాండింగ్ చేయించారు.. అడ్డంగా బుక్ అయ్యారు
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
ఈ ఏడాది ప్రారంభంలో ఆ షిప్ యూకే నుంచి బయలుదేరింది. అయితే.. మార్గమధ్యంలో క్రిస్టోఫర్ కాస్త అస్వస్థతకు గురయ్యాడు. దీంతో.. అతడు మెడికల్ చెకప్ కోసం క్రూజ్ షిప్ వైద్యుడ్ని సంప్రదించాడు. ఆ వైద్యుడు క్రిస్టోఫర్‌ని పరీక్షించిన అనంతరం.. ఓసారి ఫుల్ చెకప్ చేయించుకోవాలని, ఆ తర్వాత షిప్‌లో అనుమతిస్తామని చెప్పాడు. ఆ వైద్యుడి సూచన మేరకు.. మార్చి 4వ తేదీన ఫిలిప్పీన్స్‌లోని పలావాన్ ద్వీపంలో క్రూజ్ షిప్ నుంచి దిగాడు. అతడు పరీక్షలు చేయించుకోగా.. అదృష్టవశాత్తూ క్రిస్టోఫర్‌కు తేలికపాటి హార్ట్ స్ట్రోక్ మాత్రమే వచ్చినట్టు తేలింది. కానీ.. బ్యాడ్ లక్ ఏమిటంటే, క్రిస్టోఫర్ వైద్యు పరీక్షలు పూర్తయ్యే సమయానికి ఆ ఓడ అతడ్ని వదిలి, అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పుడు క్రిస్టోఫర్, అతని మేనకోడలు వెంటనే క్రూజ్ షిప్ సిబ్బంది, ప్రయాణ బీమా సంస్థలను సంప్రదించారు. క్రిస్టోఫర్ పరిస్థితి విషమంగా ఉందని తేలడంతో, ఆయన్ను వదిలి వెళ్లాల్సి వచ్చిందని, ఇప్పుడు తిరిగి రావడం కష్టతరం అవుతుందని వాళ్లు సమాధానం ఇచ్చారు.
Ex-Boyfriend Acid Attack: పెళ్లిలో షాకింగ్ ఘటన.. వరుడిపై యువతి యాసిడ్ దాడి
ఇంకేముంది.. తిరిగి ఇంటికి వెళ్లేందుకు క్రిస్టోఫర్ సిద్ధమయ్యాడు. అయితే.. విమాన మార్గం ద్వారా వెళ్లడం వీలు కాదని ఎయిర్‌లైన్ సంస్థలు అతనికి ఝలక్ ఇచ్చాయి. చివరికి ఏప్రిల్ 7వ తేదీన తనకు విమానంలో వెళ్లేందుకు అనుమతి లభించడంతో.. క్రిస్టోఫర్ తిరిగి యూకేలోని తన ఇంటికి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై క్రిస్టోఫర్ మాట్లాడుతూ.. తనని ఓడ నుంచి బయటకు పంపిన వ్యక్తి పూర్తిగా పరీక్షించలేదని వాపోయాడు. వైద్య పరీక్షలకు ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, ఆ ఓడ తన కోసం వేచి ఉండాల్సిందన్నాడు. తన పరిస్థితి నిజంగానే క్లిష్టంగా ఉన్నట్లైతే.. తనకు మరింత సమాచారం ఎందుకు ఇవ్వలేదని, మెడికల్ రిపోర్ట్ ఎక్కడంటూ మండిపడ్డాడు. ప్రస్తుతం అతడు షిప్‌లో ఉన్న లగేజ్ కోసం వేచి చూస్తున్నాడు.
తాజావార్తలు
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!