Pakistan: భారతదేశం చేతిలో ఎన్ని సార్లు భంగపాటుకు గురైనా నాదే పైచేయి అంటుంది పాకిస్తాన్. అబద్ధాలను అవలీలగా ప్రచారం చేస్తుంది. చివరకు పాకిస్తాన్ ప్రభుత్వంలో అగ్ర నేతలుగా చలామణీ అవుతున్న వారు కూడా అబద్ధాలను ప్రచారంలో చేయడంలో పోటీ పడుతున్నారు. తమ పౌరుల్ని అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ నుంచి పాకిస్తాన్‌ని భారత్ త్రివిధ దళాలు చితకబాదుతున్నా కూడా బుద్ధి రావడం లేదు.
తాజాగా, ఈరోజు జరిగిన పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశాల్లో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మళ్లీ అబద్ధాలకు తెరతీశాడు. భారతదేశంతో ఉద్రిక్తత నేపథ్యంలో పాకిస్తాన్‌పై ఇతర దేశాల ఒత్తిడిని అంగీకరించేది లేదని చెప్పాడు. పాక్ ఆర్మీ భారత పౌరుల్ని లక్ష్యంగా చేసుకోదని, కేవలం వారి సైనిక స్థావరాలనే టార్గెట్ చేస్తామని చెప్పారు. తాము భారత్‌కి ధీటుగా 200 శాతం స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించాడు.
Read Also: India Pakistan War: ‘‘ఆ నవ్వు చెబుతుంది, పాకిస్తాన్ నష్టం గురించి’’..
భారత్ తన సొంత ప్రజల్ని శాంతింపచేయడానికి వారి మీడియా తప్పుడు ప్రచారం చేసిందని పాక్ మంత్రి ఆరోపించాడు. భారత్ ఓడిపోతుందనే విషయాన్ని చెప్పడం లేదని అన్నారు. ఇజ్రాయిల్, భారత్ మధ్య పొత్తు సహజమని, ఈ రెండు దేశాలు ఇస్లాం పట్ల బహిరంగ వ్యతిరేకతను కలిగి ఉన్నాయని ఆరోపించాడు. పాకిస్తాన్‌కి టర్కీ, అజర్‌బైజాన్ దేశాలు మద్దతు ఇస్తున్నాయని, భారత్‌కి దాని మిత్రులు కూడా సాయం చేయడం లేదని మరో అబద్ధం చెప్పాడు.
ఎల్ఓసీ వద్ద భారత్ చర్యల్ని పాకిస్తాన్ సైన్యం అడ్డుకుందని, భారత్ డ్రోన్ దాడులు పాకిస్తాన్ కీలక ప్రదేశాలను గుర్తించాలని వచ్చాయని, అయితే, పాక్ తన కీలక స్థానాలు తెలియకుండా ఉండేందుకే వాటిని అడ్డుకోలేదని సంచలన అబద్ధాని చెప్పాడు. డ్రోన్లు తమ పరిధిలోకి వచ్చిన తర్వాత వాటిని కూల్చేశామని అన్నారు. భారత్‌తో ఉద్రిక్త పరిస్థితులు తగ్గించడానికి పాకిస్తాన్ ప్రతీరోజూ యూఏఈ, సౌదీ అరేబియా, చైనాతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పాడు.
🚨 Joke of the DAY.
Pakistan Defence Minister says — "We didn’t intercept Indian drones to avoid exposing our locations." 😂 pic.twitter.com/3u4dlpqkxB
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 9, 2025