Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యల కేసులో ట్విస్ట్..
- మైనర్ బాలికపై ఫిర్యాదు వెనక్కి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jantar Mantar Protest: నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన నిర్వహించారు. ఈ నిరసనల్లో ప్రధాని నరేంద్ర మోడీని అత్యంత దారుణంగా తిట్టిన మైనర్ బాలికపై కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. బాలికపై ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారు స్మృతి సింగ్ తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ సెల్ఫీ వీడియోలో పిల్లల్ని క్షమిస్తున్నట్లు ప్రకటించడం, మైనర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
ఈ పరిణామాలకు ముందు ఘజియాబాద్ నివాసి స్మృతి సింగ్, నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్లో ఒక మైనర్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగినందున, దీనిని జీరో ఎఫ్ఐఆర్గా నమోదు చేశారు. అనంతరం దర్యాప్తును ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు. నిరసన ప్రదర్శన సమయంలో ప్రధానితో పాటు ఆయన తల్లిపై అభ్యంతరకరమైన మాటలు వాడారని స్మృతి సింగ్ చెప్పారు. దీంతోనే తాను ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇప్పుడు ప్రధాని పిల్లల్ని క్షమించడంతో, మైనర్‌తో పాటు ఆమె తల్లి పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో తాను కంప్లైంట్ వాపస్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
Also Read
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్న మైనర్ బాలిక జూలై 23న, ప్రధానిని ఉద్దేశిస్తూ చట్టానికి, సామాజిక మర్యాదకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత తన తప్పును గ్రహించి కన్నీటితో క్షమాపణలు చెప్పింది. ప్రధాని మోడీ కూడా పిల్లలు తప్పులు చేస్తారని, వారు తమ తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వాలని, అందుకు తనపై అనుచిత వ్యా్ఖ్యలు చేసిన వారిని క్షమిస్తున్నట్లు ప్రకటించారు. మైనర్ బాలిక తల్లి ఇది తన బిడ్డకు మోడీ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ పరిణామాల తర్వాత ఫిర్యాదుదారు కూడా తన కేసును వాపస్ తీసుకున్నారు.
తాజావార్తలు
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!