Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya: తమిళ స్టార్ హీరో సూర్య చేసిన తాజా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. సినిమా విజయాలు, అపజయాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన కెరీర్లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ..”‘కంగువ’ సినిమా కోసం దాదాపు 200 రోజుల పాటు పనిచేశాను. ఎంతో కష్టపడి, భారీ స్థాయిలో తెరకెక్కించిన ఆ చిత్రం మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ ‘కరుప్పు’ సినిమాను కేవలం 45 రోజుల్లో పూర్తి చేశాం. అయితే ఈ సినిమా మాత్రం థియేటర్స్‌లో రిలీజ్ అయిన తర్వాత ఈ ఏడాది అతిపెద్ద ఇండస్ట్రీ సక్సెస్‌ల్లో నిలిచిన పలు సినిమాల్లో ఈ సినిమా అగ్రస్థానంలో నిలిచింది” అని అన్నారు.
సినిమా పరిశ్రమలో సక్సెస్ కోసం కచ్చితమైన ఫార్ములా ఉండదని సూర్య పేర్కొన్నారు. “ఇండస్ట్రీలో నాకు 30 ఏళ్ల అనుభవం ఉన్నా.. అన్నీ నేర్చుకున్నానని ఇప్పటికీ చెప్పలేను. ఏ సినిమా ఎలా ఆడుతుందో ముందే అంచనా వేయడం చాలా కష్టం. ప్రతి సినిమా కొత్త అనుభవాన్నే నేర్పిస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ‘కంగువ’ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ ఒక భారీ పీరియాడిక్ యాక్షన్ ఫాంటసీ సినిమాగా తెరకెక్కించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మిత్రమ స్పందనను సొంతం చేసుకుంది. ఆర్జే బాలాజీ డైరెక్షన్లో తమిళ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం ‘కరుప్పు’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రిన్ని మేకర్స్ ఒక సూపర్ హిట్ ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. 2026 మే నెలలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని, 2026 సంవత్సరంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. తాజాగా హీరో సూర్య ఈ రెండు సినిమాలకు పోల్చుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా విజయాన్ని కేవలం బడ్జెట్, షూటింగ్ రోజులు లేదా భారీ నిర్మాణ విలువలు మాత్రమే నిర్ణయించవని, ప్రేక్షకుల ఆదరణే చివరికి అసలు విజయాన్ని నిర్ణయిస్తుందని ఆయన మాటలు మరోసారి గుర్తు చేస్తున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Irumudi : పవిత్ర దీక్షను తాగుబోతులకు ఆపాదిస్తారా? 'ఇరుముడి'పై భగ్గుమన్న అయ్యప్ప భక్తులు..
- Viswanadh & Sons : ఈ వారమే OTTలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఎక్కడ చూడాలంటే?
- AVD తర్వాత మరో మల్టీప్లెక్స్.. నార్త్ హైదరాబాద్‌పై రౌడీ హీరో కన్ను!
- Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
తాజావార్తలు
-
Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
-
Irumudi : పవిత్ర దీక్షను తాగుబోతులకు ఆపాదిస్తారా? ‘ఇరుముడి’పై భగ్గుమన్న అయ్యప్ప భక్తులు..
-
Viswanadh & Sons : ఈ వారమే OTTలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఎక్కడ చూడాలంటే?
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
-
Cheapest Phone: కిందపడినా పగలని ఫోన్.. కేవలం రూ.1499లకే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!